Share News

kumaram bheem asifabad- ఆయుష్‌ సేవలు అంతంతే

ABN , Publish Date - Dec 19 , 2025 | 10:20 PM

ఆయుష్‌ ఆయుర్వేదం యోగా యునానీ (హోమియో) విభాగంలోని వైద్య సేవలు జిల్లాలో అంతంత మాత్రంగానే అందుతున్నాయి. సంప్రదాయ వైద్యాన్ని బలోపేతం చేయాలనే భావనంతో కేంద్ర ప్రభుత్వం వీటిని ప్రారంభించినా క్షేత్ర స్థాయికి వచ్చే సరికి ఆశించిన ఫలితం దక్కడం లేదు. జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎన్‌హెచ్‌ఎం పరిధిలో ఈ కేంద్రాలు కొనసాగుతున్నా వైద్యుల ఖాళీలు, మందుల కొరత వెక్కిరిస్తోంది.

kumaram bheem asifabad- ఆయుష్‌ సేవలు అంతంతే
జైనూర్‌ మండలం ఉషెగాంలోని హోమియో వైద్యశాల

- మరో వైపు మందుల కొరత

- అధికారులు చొరవ తీసుకుంటేనే మెరుగైన వైద్యం

జైనూర్‌ డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఆయుష్‌ ఆయుర్వేదం యోగా యునానీ (హోమియో) విభాగంలోని వైద్య సేవలు జిల్లాలో అంతంత మాత్రంగానే అందుతున్నాయి. సంప్రదాయ వైద్యాన్ని బలోపేతం చేయాలనే భావనంతో కేంద్ర ప్రభుత్వం వీటిని ప్రారంభించినా క్షేత్ర స్థాయికి వచ్చే సరికి ఆశించిన ఫలితం దక్కడం లేదు. జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎన్‌హెచ్‌ఎం పరిధిలో ఈ కేంద్రాలు కొనసాగుతున్నా వైద్యుల ఖాళీలు, మందుల కొరత వెక్కిరిస్తోంది. ఈ విభాగం సేవల కోసం బాధితులు ఆసక్తి చూపుతున్నా ప్రభుత్వ పరంగా వసతులు, సౌకర్యాలు కల్పించక పోవడంతో ప్రైవేటును ఆశ్రయించాల్సిన పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా ఆయూష్‌ కేంద్రాలు పీహెచ్‌సీ (ప్రాథమిక సామాజిక ఆరోగ్య కేంద్రం), సీహెచ్‌సీ (సామాజిక ఆరోగ్య కేంద్రం)లల్లోనే కొనసాగుతున్నాయి. పక్కనున్న మంచిర్యాల పట్టణంలో హోమియో ఆయుష్‌ ఆయుర్వేదం క్లినిక్‌లు పదుల కొద్దీ ఉండడంతో జిల్లా వాసులు అటు వైపు వెళ్ళాల్సి వస్తోంది.

- పీహెచ్‌సీలకు వచ్చే వారితోనే..

ఆయుష్‌ కేంద్రాలు పీహెచ్‌సీలు. సీహెచ్‌సీలలో కొనసాగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో వాటి మనుగ డ కోసం సిబ్బంది మందుల కొరత లేదన్నట్లుగా చూపించేం దుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సమస్యలను ఆధిగమించేందుకు పీహెచ్‌సీకి వచ్చే వారినే కొందరిని ఆయూష్‌ వైద్యం పొందుతున్నట్లు వివరాలు నమోదు చేస్తున్నట్లు సమాచారం. ఇలా జిల్లాలోని పలు కేంద్రాల్లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

-జిల్లాలో పరిస్థితి ఇలా..

మొత్తం 20 కేంద్రాలు ఉన్నాయి. ఇందులో శాశ్వత కేంద్రాలు 10: ఆయుర్వేదం విభాగానికి చెందినవి: 6(బెజ్జూర్‌, బిబ్రా, చిర్రకుంట, వాంకిడి, గురుడుపేట, పంగిడి)హోమియో విభాగం: 2. (సిర్పూర్‌(టి) ఉషే గాం), యూనానీ విభాగం 2, (కెరమెరి, కాగజ్‌నగర్‌) కేంద్రాల్లో ఉండాల్సిన సిబ్బంది: 30ప్రస్తుతం ఉన్న వారు: 20: ఖాళీలు: 10 (ఇందులో ప్రధానంగా మెడికల్‌ అఫీసర్లు నలుగురు, ఫార్మసిస్టులు ఆరుగురు) ఎన్‌అర్‌హెచ్‌ఎం(నేషనల్‌ రూరల్‌ హెల్త్‌ మిషన్‌) కింద కొనసాగుతున్నవి 10: ఆయుర్వేదం విభాగం 3. (ఆడ, గిన్నెధరి, లింగాపూర్‌), హోమియో: 5(ఆసిఫా బాద్‌, ఈజ్‌గాం, పెంచికలపేట, రెబ్బెన, తిర్యాణి)యూనానీ: 2 (జైనూర్‌, కౌటాల) మొత్తం సిబ్బంది: 30 పని చేస్తోంది: 18, ఖాళీలు: 12 (ఇందులో మెడికల్‌ అఫీసర్లు ఇద్దరు, ఫార్మసిస్టులు ఆరుగురు, మిగితా ఇతర సిబ్బంది), జిల్లాలో మొత్తం 20 శాశ్వత కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 10: ఆయుర్వేదం విభాగానికి చెందినవి: 6(బెజ్జూర్‌, బిబ్రా, చిర్రకుంట, వాంకిడి, గురుడు పేట, పంగిడి) హోమియో విభాగం: 2. (సిర్పూర్‌(టి) ఉషేగాం), యూనానీ విభాగం 2, కెరమెరి, కాగజ్‌నగర్‌)కేంద్రాల్లో ఉండాల్సిన సిబ్బంది: 30, ప్రస్తుతం ఉన్న వారు: 20 ఖాళీలు10 (ఇందులో ప్రధానంగా మెడికల్‌ అఫీసర్లు నలుగురు, ఫార్మాసిస్టులు ఆరుగురు ), ఓర్‌అర్‌హెచ్‌ ఎం( నేసనల్‌ రూరల్‌ హెల్త్‌ మిషన్‌) కింద కొనసాగుతున్నవి 10: ఆయుర్వేదం విభాగం 3. (ఆడ, గిన్నెధరి, లింగాపూర్‌), హోమియో 5:( ఆసిఫాబాద్‌, ఈజ్‌గాం, పెంచికల్‌ పేట, రెబ్బెన, తిర్యాణి. యూనానీ 2: (జైనూర్‌, కౌటాల). మొత్తం సిబ్బంది 30: పని చేస్తోంది 18 ఖాళీలు 12(ఇందులో మెడికల్‌ అఫీసర్లు ఇద్దరు, ఫార్మసిస్టులు ఆరుగురు, మిగిత ఇతర సిబ్బంది) ఇప్పటికైనా అధికారులు స్పందించి ఖాళీలు భర్తీ చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చూడా లని కోరుతున్నారు.

Updated Date - Dec 19 , 2025 | 10:20 PM