Share News

గ్రామసభలపై అవగాహన కల్పించాలి

ABN , Publish Date - Apr 29 , 2025 | 11:16 PM

సమాచార హక్కు చట్టం, గ్రామసభ ప్రా ముఖ్యతపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ దేవసహాయం అన్నారు.

గ్రామసభలపై అవగాహన కల్పించాలి
శిక్షణలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ దేవసహాయం

- అదనపు కలెక్టర్‌ దేవసహాయం

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): సమాచార హక్కు చట్టం, గ్రామసభ ప్రా ముఖ్యతపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ దేవసహాయం అన్నారు. మంగళ వారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ, పంచాయతీరాజ్‌ గ్రామీణాభి వృద్ధి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం, గ్రామసభలపై ప్రతీ మండల నుంచి ఇద్దరు చొప్పున పంచాతీయ కార్యద ర్శులకు శిక్షణ నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందడంలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రా మ్మోహన్‌రావు, రీజినల్‌ ట్రైనింగ్‌ మేనేజరు ఎస్‌.హనుమంతు, రీసోర్స్‌ పర్సన్స్‌ కృష్ణ, కోటేశ్వ ర్‌రావు, నర్సిరెడ్డి పాల్గొన్నారు.

బార్‌ షాపులకు లక్కీడిప్‌

కందనూలు : అచ్చంపేట మునిసిపాలిటీలో రద్దయిన రెండు బార్‌ షాపులకు అదనపు కలెక్టర్‌ దేవసహాయం లక్కీ డిప్‌ తీసి నూతన కేటాయింపులు చేశారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో డిప్‌ కార్యక్రమం ఏర్పాటు చేసి అభ్యర్థులను ఎంపిక చేశారు. డిప్‌లో వనపర్తికి చెందిన జి.రాజేష్‌, రంగారెడ్డి జిల్లా సరూర్‌ నగ ర్‌కు చెందిన కె.ఆనంద్‌ ఎంపికయ్యారు. 18 దరఖాస్తులు రాగా, వాటిలో దరఖాస్తుదారుల సమక్షంలో లక్కీ డిప్‌ ద్వారా ఎంపిక చేశామని తెలిపారు. కార్యక్రమలో జిల్లా ఎక్సైజ్‌ అధికారి డి.గాయత్రి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2025 | 11:16 PM