Share News

ఆటో యూనియన్‌ ఽనాయకుల ధర్నా

ABN , Publish Date - Jun 16 , 2025 | 11:29 PM

తమకు కేటాయించిన స్థలాన్ని మ రొకరికి ఇచ్చే ప్రయత్నాన్ని ఆపాలని డిమాండ్‌ చేస్తూ బెల్లంపల్లి ఆటోడ్రై వర్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సోమవారం నస్పూర్‌ లోని కలెక్టరే ట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.

ఆటో యూనియన్‌ ఽనాయకుల ధర్నా
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న ఆటో యూనియన్‌ నాయకులు

నస్పూర్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి) : తమకు కేటాయించిన స్థలాన్ని మ రొకరికి ఇచ్చే ప్రయత్నాన్ని ఆపాలని డిమాండ్‌ చేస్తూ బెల్లంపల్లి ఆటోడ్రై వర్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సోమవారం నస్పూర్‌ లోని కలెక్టరే ట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అందించారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ తమకు 25 ఏళ్ల కిందట సింగరేణి అధికారులు ఆ యూనియన్‌ కొరకు స్థలాన్ని కేటాయించారన్నారు. ఇంత కాలం ఆ స్థలాన్ని తాము వినియోగిస్తున్నామని, ప్రస్తుతం రెవెన్యూ అధికా రులు ఆ స్థలాన్ని స్వచ్చంద సంస్థకు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నా రన్నారు. ఆ భూమిని ఎవరికి ఇవ్వకుండ తమకే కేటాయించి పట్టా ఇవ్వా లని విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్‌ అధ్యక్షులు రాము కుమార్‌తో పాటు పలువురు యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jun 16 , 2025 | 11:29 PM