Share News

అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి

ABN , Publish Date - Nov 28 , 2025 | 12:19 AM

యువత రాజకీయాల్లో రాణిం చాలని, ఆశయంతో ముందుకు వెళ్లాలని కానీ ఎన్నికల సమయంలో గొడ వలకు పోతే కేసులు నమోదవుతాయని డీసీపీ భాస్కర్‌ అన్నారు. గ్రామపం చాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం హాజీపూర్‌ మండలంలో నిర్వహి స్తున్న సాధారణ ఎన్నికల సర్పంచ్‌, వార్డు సభ్యుల పోలింగ్‌ కేంద్రంలో ఎ న్నికల నామినేషన్‌ ప్రక్రియను డీసీపీ పరిశీలించారు.

అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి

మంచిర్యాల డీసీపీ భాస్కర్‌

హాజీపూర్‌, నవంబరు 27(ఆంధ్రజ్యోతి) : యువత రాజకీయాల్లో రాణిం చాలని, ఆశయంతో ముందుకు వెళ్లాలని కానీ ఎన్నికల సమయంలో గొడ వలకు పోతే కేసులు నమోదవుతాయని డీసీపీ భాస్కర్‌ అన్నారు. గ్రామపం చాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం హాజీపూర్‌ మండలంలో నిర్వహి స్తున్న సాధారణ ఎన్నికల సర్పంచ్‌, వార్డు సభ్యుల పోలింగ్‌ కేంద్రంలో ఎ న్నికల నామినేషన్‌ ప్రక్రియను డీసీపీ పరిశీలించారు. సర్పంచ్‌ ఎన్నికల నా మినేషన్ల ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో, భద్రత, శాంతిభద్రతలను ప ర్యవేక్షించడానికి డీసీపీ నామినేషన్‌ కేంద్రాలను సందర్శించారు. నామినే ష న్‌ కేంద్రాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నామి నేషన్‌ కేంద్రాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించారు. నామి నేషన్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకో కుండా పటిష్ట భద్రత చర్యలను చేపట్టాలని ఎస్‌ఐ స్వరూప్‌ రాజ్‌ను ఆదే శించారు. మొదటి విడతలో భాగంగా జిల్లాలోని 28 నామినేషన్‌ కేంద్రా లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి నామినేషన్‌ కేంద్రంలో పూర్తి బం దోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నామినేషన్‌ వేసే అభ్యర్థితో పాటు మరో ఇద్దరిని మాత్రమే కేంద్రంలోకి అనుమతి ఉన్నట్లు వివరించారు. డీ సీపీ వెంట మంచిర్యాల రూరల్‌ సీఐ ఆకుల అశోక్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌ రావు దేశ్‌ పాండే, ఎంపీడీవో సాయివెంకట్‌ కృష్ణరెడ్డి ఉన్నారు.

Updated Date - Nov 28 , 2025 | 12:19 AM