kumaram bheem asifabad- ‘ఆసరా’పై ఆడిట్
ABN , Publish Date - Jul 10 , 2025 | 11:24 PM
రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్ల ఆడిట్(సామాజిక తనిఖీ) నిర్వహించాలని నిర్ణయించింది. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద చేపట్టే పనుల్లో అవకత వకలు, అక్రమాల గుట్టు రట్టు చేసేందుకు మండలాల వారీగా సామాజిక తనిఖీ నిర్వహించి అక్రమాలకు పాల్పడిన వారి నుంచి సొమ్ము రికవరీ చేస్తున్నారు. అదే మాదిరిగా ఆసరా పెన్షన్లపై కూడా సామాజిక తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- మార్గదర్శకాల రూపకల్పనలో ఉన్నతాధికారులు
- పంపిణీల్లోనూ అవకతవకలపై ఫిర్యాదులు
- అర్హులకు లబ్ధి చేకూరేలా చర్యలు
- జిల్లాలో 54 వేల మంది పింఛన్‌దారులు
చింతలమానేపల్లి, జూలై 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్ల ఆడిట్(సామాజిక తనిఖీ) నిర్వహించాలని నిర్ణయించింది. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద చేపట్టే పనుల్లో అవకత వకలు, అక్రమాల గుట్టు రట్టు చేసేందుకు మండలాల వారీగా సామాజిక తనిఖీ నిర్వహించి అక్రమాలకు పాల్పడిన వారి నుంచి సొమ్ము రికవరీ చేస్తున్నారు. అదే మాదిరిగా ఆసరా పెన్షన్లపై కూడా సామాజిక తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవకతవకలను గుర్తించి అక్రమార్కులను తొలగించా లని నిర్ణయించింది.
- అనర్హులకు అందుతున్నాయనే..
ఆసరా పెన్షన్లు అనర్హులకు అందుతున్నాయనే ఆరో పణలు నిత్యం వింటూనే ఉంటాం. అలాంటి వారిని గుర్తించి పెన్షన్లు తొలగించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం సామాజిక తనిఖీ చేపడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని 15 మండలాల పరిధిలో 54,589 మంది ఆస రా పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో వృద్ధ్యాప్య పింఛన్ పొందేవారు 23,253 మంది, ఒంటరి, వితంతువులు 21,612 మంది, దివ్యాంగులు 5,858 గీత కార్మికులు 133 మంది ఉన్నారు. వీరికి నెలనెలా రూ. 12,76,65,936 రాష్ట్ర ప్రభుత్వం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా పోస్టల్ శాఖకు అందజేస్తున్నది. బ్రాంచ్ పోస్టు మాస్టర్ల ద్వారా లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతీ నెల ఆసరా పెన్షన్లపై సామాజిక తనిఖీ నిర్వహిస్తే అనర్హులు, అవకతవకలకు పాల్పడే వారి గుట్టు రట్టయ్యే అవకా శం ఉన్నదని చెబుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా అనర్హులు కొందరు పింఛన్లు తీసుకుంటున్నట్లు ప్రభు త్వం దృష్టికి వచ్చింది. వృద్ధాప్య, దివ్యాంగ పింఛన్లు పొందుతున్న వారిలో అనర్హులు ఉన్నారనే ప్రచారం ఉంది. తనిఖీ నిర్వహిస్తే ఇలాంటి అవకతవకలన్నీ బయట పడే అవకాశం ఉన్నది.
- తపాలా శాఖ ద్వారా..
ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో తపాలాశాఖ ద్వారా పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది. పంపిణీదా రులు మాత్రం వేలి ముద్రలు తీసుకొని పింఛన్లు అందజేస్తు న్నారు. వేలి ముద్రలు పడకపోతే ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు వేలి ముద్రతో అందజేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పంపిణీలో కూడా పలు చోట్ల అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ప్రభు త్వం దృష్టికి వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అవకతవకలు, అక్రమాలను గుర్తించేం దుకు ఆసరా పింఛన్లపై సామాజిక తనిఖీ నిర్వహించడమే మార్గమని భావించిన ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటోంది. ఆసరా పింఛన్లపై సామాజిక తనిఖీ నిర్వహించేందుకు అవసరమైన మార్గ దర్శకాలు రూపొందించే పనిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు నిమగ్నమయ్యారు. విధి విధానాల రూప కల్పన పూర్తి కాగానే సామాజిక తనిఖీలకు సంబంధించి షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నది. కొందరు వృద్ధులు తమ వేలి ముద్ర పడకపోయినా ఆయా పంచాయతీ కార్యదర్శి వేలిముద్ర సహాయంతో వారికి పింఛను అందజేస్తారు. కానీ ఈ సామాజిక తనిఖీ అని తెలుసుకున్న అధికారులు వృద్ధుల వేళ్లు పడని వారిని గుర్తించి వారిని ఆధార్ అప్‌డేట్ చేసుకో వాలని చెబుతున్నారు. మీ వేలి ముద్రతోనే పింఛన్లు అందజేస్తామని లేకుంటే లేదని తేల్చి చెబుతున్నారు. దీంతో వేలి ముద్ర పడని వృద్ధులు తమ ఆధార్ అప్‌డే ట్ చేసుకోవడంతో పాటు వేలి ముద్రలు పడేలా చూసు కుంటున్నారు.