Share News

kumaram bheem asifabad- తెలంగాణ గ్రామీణ బ్యాంకులో చోరీకి యత్నం

ABN , Publish Date - Oct 22 , 2025 | 11:34 PM

మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగుడు చోరీకి యత్నించాడు. బ్యాంకు కిటికి ఊచలను తొలగించి దుండగుడు బ్యాంకులోకి ప్రవేశించాడు. ముందుగా క్యాషియర్‌ క్యాబిన్‌లోని డ్రాలో డబ్బుల కోసం వెతకగా ఎలాంటి నగదు లభించ లేదు. దీంతో అకౌంటెంట్‌ టేబుల్‌ వద్దకు వెళ్లి అక్కడ ఉన్న డ్రాలో వెతకగా ఫలితం లేక పోవడంతో నేరుగా మేనేజర్‌ గదిలోకి వెళ్లి అక్కడ ఉన్న సీసీ కెమరాల వైపును తొలగించి బ్యాంకు లాకర్‌ గది తాళం పగలగొట్టే ప్రయత్నం చేశారు.

kumaram bheem asifabad- తెలంగాణ గ్రామీణ బ్యాంకులో చోరీకి యత్నం
బ్యాంకులో పరిశీలిస్తున్న ఎస్సై వెంకటకృష్ణ

రెబ్బెన, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగుడు చోరీకి యత్నించాడు. బ్యాంకు కిటికి ఊచలను తొలగించి దుండగుడు బ్యాంకులోకి ప్రవేశించాడు. ముందుగా క్యాషియర్‌ క్యాబిన్‌లోని డ్రాలో డబ్బుల కోసం వెతకగా ఎలాంటి నగదు లభించ లేదు. దీంతో అకౌంటెంట్‌ టేబుల్‌ వద్దకు వెళ్లి అక్కడ ఉన్న డ్రాలో వెతకగా ఫలితం లేక పోవడంతో నేరుగా మేనేజర్‌ గదిలోకి వెళ్లి అక్కడ ఉన్న సీసీ కెమరాల వైపును తొలగించి బ్యాంకు లాకర్‌ గది తాళం పగలగొట్టే ప్రయత్నం చేశారు. దాంతో బ్యాంకులో ఉనన సెక్యూరిటీ అలారం మోగడంతో పాటు మేనేజర్‌ సెల్‌కు సెక్యూరిటీ అలారం వచ్చింది. అప్రమత్తమైన మేనేజర్‌ శ్రీకాంత్‌, వెంటనే క్యాషియర్‌ ప్రసాద్‌ను అప్రమత్తం చేసి బ్యాంకు వద్దకు వెళ్లి గమనించాలని ఆదేశించారు. హుటాహుటిన ప్రసాద్‌ బ్యాంకు వద్దకు చేరుకోగా అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి బ్యాంకు ఉత్తరం వైపున ఉన్న కిటికీ నుంచి బయటకు దూకి పారిపోయాడు. ప్రసాద్‌ 100 డయల్‌కు కాల్‌ చేసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. బ్యాంకు, పోలీసు సిబ్బంది బ్యాంకు షెటర్‌ తాళాలు తెరిచి బ్యాంకు లోపలికి వెళ్లి పరిశీలించారు. ఉత్తరం వైపు ఉన్న కిటికీ ఊచలు తొలగించి కిటికీ అద్దాలు పగలగొట్టి దొంగ బ్యాంకులోకి ప్రవేశించినట్లు గుర్తించారు. క్యాషియర్‌, అకౌంటెంట్‌తో పాటు మేనేజర్‌ గదులను పరిశీలించారు. లాకర్‌ తాళం పగలగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ సెక్యూరిటీ అలారం మోగడంతో దొంగ పారిపోయినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న ఏఎస్పీ చిత్తరంజన్‌, సీఐ సంజ య్‌, ఎస్సై వెంకటకృష్ణలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దొంగ ఆచూకీ తెలుసుకునేందుకు వెంటనే క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌లను రప్పించి వేలిముద్రలు, ఆధారాలను సేకరించారు. దొంగను పట్టుకునేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బ్యాంకు నుంచి ఎలాంటి డబ్బు గానీ, బంగారం గాని చోరీకి గురి కాలేదని మేనేజర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు.

Updated Date - Oct 22 , 2025 | 11:34 PM