సీజేఐపై దాడికి యత్నం హేయమైన చర్య
ABN , Publish Date - Oct 07 , 2025 | 11:15 PM
సుప్రీం కోర్టులో సీజేఐ భూషణ్ రామకృష్ణ గవాయ్‌పై ఓ మతోన్మాది షూ విసిరే ప్రయత్నం చేయడం హేయమైన చర్య అని జి ల్లాలోని పలు ప్రజాసంఘాల నాయకులు తీ వ్రంగా ఖండించారు.
- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడికి యత్నం ఘటనపై నిరసన
- అచ్చంపేటలో పాల్గొన్న జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేందర్
- మతోన్మాద విష సంస్కృతి వల్లే ఈ భౌతిక దాడులు
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.బాలనరసింహ
కందనూలు/ కొల్లాపూర్/ కల్వకుర్తి/ అచ్చం పేటటౌన్/ నాగర్‌కర్నూల్ టౌన్/ తాడూరు/ బ ల్మూరు/ అమ్రాబాద్/ మన్ననూరు, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : సుప్రీం కోర్టులో సీజేఐ భూషణ్ రామకృష్ణ గవాయ్‌పై ఓ మతోన్మాది షూ విసిరే ప్రయత్నం చేయడం హేయమైన చర్య అని జి ల్లాలోని పలు ప్రజాసంఘాల నాయకులు తీ వ్రంగా ఖండించారు. జిల్లాలో చాలా ప్రాంతాల్లో నిరసన వ్యక్తం చేశారు. ధర్మపీఠంపై దాడిగా అ భివర్ణిస్తూ, తీవ్రంగా ఖండించారు. షూ విసిరేం దుకు యత్నించిన న్యాయవాది రాకేష్ కిశోర్ దిష్టిబొమ్మ దహనం చేశారు.
- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై దాడిని నిరసిస్తూ మంగళవారం అచ్చంపేటలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ని రసన తెలిపి న్యాయవాది రాకేష్ కిశోర్ దిష్టిబొమ్మ దహ నం చేశారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేం దర్ మాట్లాడుతూ దాడిని ఖండించారు.
- కొల్లాపూర్ జూనియర్ సివిల్ కోర్టు ఎదుట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు ఆధ్వ ర్యంలో న్యాయవాదులు నిరసన తెలిపారు.
- నాగర్‌కర్నూల్‌లో బీఎస్పీ రాష్ట్ర కమిటీ స భ్యుడు పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
- నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేడ్క ర్ చౌరస్తాలో దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్‌పీఎస్) జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరస న చేపట్టా రు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు లు ఎం.బాలనరసింహ, కొమ్ము భరత్, బండి లక్ష్మీపతి మాట్లాడుతూ మతోన్మాద విషసంస్కృ తి వల్లే దాడులు జరుగుతున్నాయని అన్నారు.
- తాడూరులో అంబేడ్కర్ విగ్రహం ముందు కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
- బల్మూరులో అంబేడ్కర్ సంఘం మండల నాయకులు గణేష్‌కుమార్, గంగాధర్ ఆధ్వర్యం లో నిరసన చేపట్టారు.
- అమ్రాబాద్‌లో డీటీఎఫ్ మండల అధ్యక్ష, కార్యదర్శులు భీమయ్య, శివలింగం విలేకరులతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయిపై దాడికి పాల్పడిన న్యాయవాది రాకేష్ కిశోర్‌ను చట్టపరంగా కఠిన చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేశారు.
- అమ్రాబాద్ మండలం మన్ననూరులో మం గళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీఎం జిల్లా నాయకుడు మల్లేష్ మాట్లాడుతూ సీజీపై దాడికి పాల్పడిన న్యాయవాది రాజేష్ కిషోర్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
- కల్వకుర్తిలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పులిజాల పరశురాములు, సీఐటీయూ అధ్యక్షుడు బి.ఆంజనేయులు ఆధ్వర్యంలో సీజేఐ పై జరిగిన దాడి రాజ్యాంగంపై జరిగిన దాడి అని అభివర్ణిస్తూ నిరసన వ్యక్తం చేశారు.