Manda krishna: దళితుడు కాబట్టే సీజేఐ గవాయ్‌పై దాడి
ABN , Publish Date - Nov 17 , 2025 | 05:52 AM
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ గవాయ్ దళితుడు కాబట్టే ఆయనపై లాయర్ దాడి చేశారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు.
సంఘీభావ సభను అడ్డుకోవడం దారుణం: మందకృష్ణ
న్యూఢిల్లీ, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ గవాయ్ దళితుడు కాబట్టే ఆయనపై లాయర్ దాడి చేశారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. ఈ వ్యవహారంలో పోలీసులు, మానవ హక్కుల కమిషన్ ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. సుమోటోగా కేసు నమోదు చేసే అధికారం ఉన్నప్పటికీ 50 రోజులైనా ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోవట్లేదని ఆరోపించారు. కేంద్రం కూడా ఈ అంశంలో వివక్ష చూపుతోందన్నారు. గవాయ్‌కు సంఘీభావంగా జంతర్‌మంతర్ వద్ద నిర్వహించతలపెట్టిన సభను అడ్డుకోవడం దారుణమన్నారు. ఆదివారం ఢిల్లీలో మందకృష్ణ మీడియాతో మాట్లాడారు. సోమవారం సభ నిర్వహించాల్సి ఉండగా.. పోలీసులు అనూహ్యంగా అనుమతిని రద్దు చేసినట్లు చెప్పారు. సీజేఐపై దాడిని దళితుల ఆత్మగౌరవంపై దాడిగానే తాము భావిస్తున్నామన్నారు.