kumaram bheem asifabad- క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలి
ABN , Publish Date - Aug 24 , 2025 | 11:15 PM
క్రీడాకారులు జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి రాష్ట్రానికి పేరు తీసుకరావాలని ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు. రెబ్బెన మండలం గోలేటి టౌన్ షిప్‌లోని సింగరేణి క్రీడా మైదానంలో ఈ నెల 23, 24 తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి బాల్‌బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీలు ఆదివారం ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గోలేటి టౌన్ షిప్ జిల్లాలోనే పలు క్రీడలకు, క్రీడాకారులకు నిలయంగా మారిందన్నారు.
రెబ్బెన, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): క్రీడాకారులు జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి రాష్ట్రానికి పేరు తీసుకరావాలని ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు. రెబ్బెన మండలం గోలేటి టౌన్ షిప్‌లోని సింగరేణి క్రీడా మైదానంలో ఈ నెల 23, 24 తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి బాల్‌బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీలు ఆదివారం ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గోలేటి టౌన్ షిప్ జిల్లాలోనే పలు క్రీడలకు, క్రీడాకారులకు నిలయంగా మారిందన్నారు. ఇక్కడి క్రీడా సంఘాల నాయకులు క్రీడా స్ఫూర్తితో విద్యార్థులను ఉత్తమ క్రీడాకారుకు తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. సింగరేణి యాజమాన్యం సహాయ సహకారాలు కూడా క్రీడాకారులకు అందిస్తున్నదని చెప్పారు. దీంతో పలువురు క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించడమే కాకుండా అంతర్జాతీయ పోటీల్లో కూడా ప్రతిభ కనబర్చడం అభినందనీయమన్నారు. తరుచూ క్రీడా పోటీలను నిర్వహించడం ద్వారా క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలికి తీయవచ్చన్నారు. క్రీడాకారుకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ సౌకర్యాలున్నాయని, వాటిని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జరిగిన పోటీల్లో బాలుర విభాగంలో వరంగల్ జట్టు ప్రథమ బహుమతి పొందగా, రంగారెడ్డి జట్టు ద్వితీయ బహుమతిని అందుకుంది. బాలికల విభాగంలో ఆదిలాబాద్ జట్టు ప్రఽథమ బహుమతి పొందగా, వరంగల్ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. కార్యక్రమంలో బెల్లంపల్లి ఏరియా జీఎం విజయభాస్కర్ రెడ్డి, బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ రావు, రాష్ట్ర కార్యదర్శి ఆర్.నారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్.తిరుపతి, షార్ప్ స్టార్ సెక్రటరి ఎం.వెంకటేశ్వర్లు ఎం.మాధవి, దుర్గయ్య, వెంకటరమణ, శ్రీనివాస్, రాజన్న, ఎ రవీందర్ గౌడ్, భాస్కర్ మల్లేష్, ఎం వెంకటేశ్వర్లు, బయ్యన్న, మాదిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.