సమస్యలతో సహవాసం
ABN , Publish Date - Jul 10 , 2025 | 12:49 AM
దేవరకొండ మునిసిపాలిటీలో ప్రజలు ప లు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అధ్వానంగా మారిన అంతర్గత రహదారులు, అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ, ఒక పక్క నీటి సమస్యతో మరో వైపు పట్టణ ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. సమస్యలను పరిష్కరించాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దోమలు, కోతుల బెడద, పలు సమస్యలతో సహవాసం చేస్తున్నారు.
సమస్యలతో సహవాసం
దేవరకొండలో మౌలిక వసతులు కరువు
మునిసిపాలిటీలో అధ్వానంగా రోడ్లు
ఇబ్బందులు పడుతున్న కాలనీ ప్రజలు
పరిష్కరించాలని వేడుకోలు
దేవరకొండ మునిసిపాలిటీలో ప్రజలు ప లు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అధ్వానంగా మారిన అంతర్గత రహదారులు, అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ, ఒక పక్క నీటి సమస్యతో మరో వైపు పట్టణ ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. సమస్యలను పరిష్కరించాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దోమలు, కోతుల బెడద, పలు సమస్యలతో సహవాసం చేస్తున్నారు.
- (ఆంధ్రజ్యోతి, దేవరకొండ)
దేవరకొండ పట్టణంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం 8 వార్డులకే పరిమితమైంది. మరో 12 వార్డుల్లో పూర్తిస్థాయిలో డ్రైనేజీ నిర్మించాల్సి ఉంది. రోడ్ల నిర్మాణానికి రూ.50 కోట్లు మంజూరైనా రూ.30కోట్లతో పనులు చేపట్టారు. మరో రూ.20 కోట్ల రోడ్ల నిర్మాణ పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. పట్టణ ప్రజలు డ్రైనేజీ, రోడ్డు, పూర్తిస్థాయిలో తాగునీరు సరఫరాకాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మునిసిపాలిటీలో 20 వార్డులకుగాను 42కు పైగా కాలనీలు ఉన్నాయి. 8500 గృహాలు ఉండగా 50వేల వరకు జనాభా ఉంది.
పట్టణంలోని 2వ వార్డు, హనుమాననగర్, రహదారిబంగ్లా, బీఎనఆర్ కాలనీ, ఖిల్లాబజార్, మున్సిఫ్ కోర్టు, అంజయ్యకాలనీ, తాటికోలు రోడ్డు కాలనీల రోడ్లన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. గుంతలమయంగా మారి ప్రమాదాలకు నిలయంగా మారాయి. టెండర్లు పిలిచి రోడ్ల ని ర్మాణం త్వరగా చేపట్టాలి. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీకి రూ.50 కోట్లు కేటాయించి 8 వార్డుల్లో పూర్తి చేశారు. పట్టణంలోని పాతబజార్, ఖిల్లాబజార్, గాంధీనగర్, పలు వార్డుల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనే జీ పనులు చేపట్టాల్సి ఉంది. వర్షాలు వస్తే రోడ్లపైనే నీరు పారుతోంది. దీంతో దోమల బెడద అధికమై ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేవరకొండ మునిసిపాలిటీకి ప్రతీరోజు 43 లక్షల లీటర్ల కృష్ణాజలాలు సరఫరా అవుతున్నాయి. కానీ ఇటీవల తరచుగా పైప్‌లైన్లు పగలడం, విద్యుత సమస్య, సాంకేతిక లోపాలతో తరచూ కృష్ణాజలాల సరఫరాకు అంతరాయం కలుగుతుంది. దీంతో కాలనీలకు 3, 4 రోజులకు ఒక్కసారి నీరు సరఫరా చేస్తుండటంతో పట్టణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేవరకొండ ఖిల్లాతో పాటు ముత్యాలమ్మబజార్, బంజార్‌భవన, సంజయ్‌కాలనీల్లో పార్కులు ఏర్పాటు చేశారు. కానీ నిర్వహణ లేకపోవడంతో పార్కులోని ఆట వస్తువులు ధ్వంసమవుతున్నాయి. ఖిల్లాలో రూ.5 కోట్లతో పార్కు నిర్మాణం చేపట్టినా పర్యాటకులకు, స్థానికులకు సౌకర్యాలు కల్పించలేదు. దీంతో పర్యాటకులు ఇబ్బందులు పడే పరిస్థితి. పట్టణంలోని గాంధీనగర్, 2వ వార్డు, హనుమాననగర్, ఖిల్లాబజార్, సంజయ కాలనీల ప్రజలు కోతులబెడదతో అవస్థలు పడుతున్నారు. వర్షాలు కురుస్తుండటంతో కాలనీల్లో దోమల బెడద అధికమైంది. మునిసిపల్ అధికారులు పాగింగ్ చేయడం లే దని ప్రజలు ఆరోపిస్తున్నారు.
పట్టణ ప్రగతిలో
సమస్య పరిష్కారం
దేవరకొండ మునిసిపాలిటీలో వంద రోజుల పట్టణ ప్రగతి ప్రణాళికలో అన్ని స మస్యలు పరిష్కరిస్తున్నట్లు మునిసిపల్ అధికారులు పేర్కొంటున్నారు. మునిసిపల్ ఉద్యోగులు, వార్డు ఆఫీసర్లు, వార్డుల్లో పర్యటించి సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇ ప్పటికే రూ.30 కోట్లతో పలు వార్డుల్లో రోడ్ల నిర్మాణాలు కొ నసాగుతున్నాయని అధికారు లు చెబుతున్నారు. మరో రూ.20 కోట్లతో టెండర్లు పి లిచి అన్ని కాలనీలకు రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మునిసిపాలిటీ లో సమీకృత మార్కెట్‌ని ర్మా ణం చేపట్టకపోవడంతో కూరగాయలు, మాంసం విక్రయదారులు రోడ్లపైనే విక్రయిస్తున్నారు.
గుంతలమయమైన రోడ్లతో ప్రమాదాలు
గాంధీబజార్ నుంచి బొడ్రాయిబజార్ 2వ వార్డుకు వెళ్లే రోడ్డు గుంతలమయమై ప్ర మాదాలు జరుగుతున్నాయి. రోడ్ల నిర్మాణాలు చేపట్టి ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలి.
-కుల్‌కుందాకార్ శ్రీను, ఖిల్లాబజార్
సమస్యలు పరిష్కరించాలి
దేవరకొండ మునిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీలు, కాల్వలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. దో మల బెడద అధికమైంది. ప్రారంభించిన రోడ్లను వేగవంతంగా పూర్తి చేయాలి. కోతుల బెడదను అరికట్టి సమస్యలు పరిష్కరించాలి.
- నేతాళ్ల వెంకటే్‌షయాదవ్, ముత్యాలమ్మబజార్, దేవరకొండ
సమస్యలను పరిష్కరిస్తాం
వంద రోజుల ప్రణాళికలో మునిసిపాలిటీలో నె లకొన్న సమస్యలన్నీ పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నాం. రోడ్ల నిర్మాణానికి రూ.50 కోట్ల నిధులు మంజూరయ్యాయి. రూ.30 కోట్లతో రోడ్ల పనులు జరుగుతుండగా రూ.20 కోట్ల పనులకు టెండర్లు పిలిచి కాలనీలకు రోడ్ల నిర్మాణం చేపడుతాం. ప్రధాన సమస్యలన్నీ పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
-సుదర్శన, మునిసిపల్ కమిషనర్, దేవరకొండ