సీబీఎం ట్రస్టు ఆధ్వర్యంలో సహాయం
ABN , Publish Date - Jun 29 , 2025 | 11:29 PM
మండలంలోని సిరసనగండ్ల పంచాయతీలోని అ యోధ్యనగర్ (గుట్ట)లో ఇళ్లు కోల్పోయిన బాధితులను తమ ట్రస్టు ద్వారా ఆదుకుంటామని సీబీఎం ట్రస్ట్ చైర్‌పర్సన్ డాక్టర్ చిక్కుడు అనురాధ అన్నారు.
- ఇళ్ల బాధితులను పరామర్శించిన ట్రస్టు చైర్‌పర్సన్ చిక్కుడు అనురాధ
చారకొండ, జూన్ 29 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని సిరసనగండ్ల పంచాయతీలోని అ యోధ్యనగర్ (గుట్ట)లో ఇళ్లు కోల్పోయిన బాధితులను తమ ట్రస్టు ద్వారా ఆదుకుంటామని సీబీఎం ట్రస్ట్ చైర్‌పర్సన్ డాక్టర్ చిక్కుడు అనురాధ అన్నారు. ఈ నెల 19న హైకోర్టు ఉత్త ర్వుల మేరకు దేవాదాయ, రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు ఇళ్లను నేలమట్టం చేశారు. ఆదివారం సీబీఎం ట్రస్ట్ చైర్‌పర్సన్ అనురాధ బాధిత కుటుంబాలను పరామర్శించి కూలిన ఇళ్లను పరిశీలించారు. ఇళ్లు కోల్పోయిన బాధితు లకు ట్రస్టుద్వారా ఒక్కొక్కరికి 25కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులతో పాటు దుప్పట్లు, రూ. 5వేల నగదును అందజేశారు. ఆమె మాట్లాడు తూ ఇళ్లు కోల్పోయిన బాధితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో బాధితులకు త్వరలోనే ఇళ్ల స్థలాలతోపాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఆదుకుంటామని ఆమె భరో సా ఇచ్చారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండె వెంకట్‌గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జమ్మికింది బాలరాంగౌడ్, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు కళ్లు ముత్యాలమ్మ, యూ త్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జైపాల్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గణేష్ గౌడ్, నాయకులు నర్సింహారెడ్డి, ప్రశాంత్ నాయక్, రూప్‌సింగ్, సందీప్‌రెడ్డి, కళ్లు సురేం దర్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, జేసీబీ వెంకటయ్య గౌడ్, బొడ్డు దశరథం, సిద్దు, రమణ, వెంకట య్య, బుజ్జిరెడ్డి, శంకర్, మోనచారి, చెన్నయ్య, హుసే న్, యాదయ్య పాల్గొన్నారు.