kumaram bheem asifabad- అడుగుకో గుంత
ABN , Publish Date - Oct 15 , 2025 | 11:23 PM
జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూరు నియోజకవర్గాలకు అనుసంధానంగా ఉన్న ప్రధాన రోడ్డుపై పలు చోట్ల గుంతలు పడ్డాయి. ఈ గుంతలు ప్రమాదకంగా మారడంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు వీటికి శాశ్వత దిశగా చర్యలు తీసుకోకుండా కేవలం కంటి తుడుపుగా మట్టితో నింపేస్తున్నారు.
- అంతర్గత రహదారులు మరీ అధ్వానం
- రాకపోకలకు వాహనదారుల అవస్థలు
- తరుచూ ప్రమాదాలు జరగుతున్న పట్టించుకోని అధికారులు
కాగజ్‌నగర్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూరు నియోజకవర్గాలకు అనుసంధానంగా ఉన్న ప్రధాన రోడ్డుపై పలు చోట్ల గుంతలు పడ్డాయి. ఈ గుంతలు ప్రమాదకంగా మారడంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు వీటికి శాశ్వత దిశగా చర్యలు తీసుకోకుండా కేవలం కంటి తుడుపుగా మట్టితో నింపేస్తున్నారు. మళ్లీ వర్షాలు కురిసిందంటే చాలు ఎప్పటి పరిస్థితే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఆసిఫాబాద్ నుంచి కాగజ్‌నగర్ వచ్చే ప్రధాన రోడ్డు పెద్దవాగు వంతెన మూలు మలుపు వద్ద గుంతలున్నాయి. ఇదే మార్గంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద కూడా పలు చోట్ల గుంతలు పడడంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
- ప్రధాన రహదారిపైనా..
సిర్పూరు-బెజ్జూరు, కాగజ్‌నగర్-దహెగాం, కాగజ్‌నగర్-బెజ్జూరు వెళ్లే ప్రధాన రహదారిలో పలు చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. గత నెలలో ఈ ప్రధాన రోడ్డుపై రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.ఈ ప్రమాదాల్లో కూడు ఇద్దరు మృతువ్యాత పడ్డారు. ఇందులో పట్టణానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు అజీం అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే వివిధ సంఘటనల్లో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాలు జరుగుతున్న పెద్దవాగు సమీపంలోని గుంతలను రూరల్ ఎస్సై సందీప్ ఆధ్వర్యంలో గుంతలను పూడ్చడంతో సమస్య తీరింది. కానీ ఎన్టీఆర్ చౌరస్తాలో గుంతలు విపరీతంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వాహనదారులు ఈ రోడ్డుమీదుగా పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. ఇక వర్షం కురిసిందంటే ఈ గుంతల్లో నీరు చేరి గుంతలు ఏర్పడక వాహనదారులు అదుపుతప్పి పడిపోతున్నారు. బస్సులు, లారీల పట్టిలు కూడా విరిగి పోతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ వెళ్లే ఈ మార్గంలోనే భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. తరుచూ భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో అధిక బరువులకు గుంతలు మరీ పెద్దవై పోతున్నాయని చెబుతున్నారు. చింతలమానేపల్లి మండలం కర్జెల్లి-గూడెం వరకు రోడ్డు అఽధ్వానంగా ఉంది. భారీ వార్షలకు పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఈ మార్గంలోనే మహారాష్ట్రలోని అహిరికి వాహనదారులు రాక పోకలు సాగిస్తుంటారు. రోడ్డు దెబ్బతినడంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. కెరమెరి మండల కేంద్రం నుంచి అనార్‌పల్లి వెళ్లే మార్గంలోని దేవాపూర్ సమీపంలో కూడా ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు కోతకు గురైంది. తిర్యాణి శివగూడసమీపంలో లోలెవల్ వంతెన కోతకు గురవడంతో మానిక్‌పూర్, మెస్రగూడ వాసులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. పెంచికల్‌పేట మండలంలోని మొర్లిగూడ రోడ్డు వర్షాలకు కోతకు గురైంది. ఈ ప్రాంతంలో ప్రజలు ఆ రోడ్డుమీదుగా రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్ల నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
వాహనదారుల అవస్థలు..
-సూర్యప్రకాష్, కాగజ్‌నగర్
గుంతలు పడిన రోడ్లపై రాకపోకలకు వాహనదారులు అవస్థలు పడుతున్నారు. చిన్నపాటి వర్షానికే గుంతల్లో నీరు నిండి కన్పించకుండా ఉంటుంది. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి రోడ్లపై ఉన్న గుంతలను శాశ్వతంగా పూడిస్తే బాగుటుంది. అధికారులు ప్రమాదాలు జరుగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి.