Share News

kumaram bheem asifabad- ఆసిఫాబాద్‌ ఆర్డీవో కార్యాలయం ఆస్తులు జప్తు

ABN , Publish Date - Jul 23 , 2025 | 11:10 PM

కుమరం భీం జిల్లా ఆసిపాబాద్‌ ఆర్డీవో కార్యాలయ ఆస్తుల జప్తునకు ఆసిఫాబాద్‌ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి యువరాజ ఉత్తర్వులు జారీ చేయడంతో బుధవారం కోర్టు సిబ్బంది కార్యాలయంలోని సామగ్రిని కోర్టుకు తరలించారు.

kumaram bheem asifabad- ఆసిఫాబాద్‌ ఆర్డీవో కార్యాలయం ఆస్తులు జప్తు
ఆర్డీవో కార్యాలయ ఆస్తులను తరలిస్తున్న కోర్టు సిబ్బంది

ఆసిఫాబాద్‌రూరల్‌, జూలై 23 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం జిల్లా ఆసిపాబాద్‌ ఆర్డీవో కార్యాలయ ఆస్తుల జప్తునకు ఆసిఫాబాద్‌ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి యువరాజ ఉత్తర్వులు జారీ చేయడంతో బుధవారం కోర్టు సిబ్బంది కార్యాలయంలోని సామగ్రిని కోర్టుకు తరలించారు. వాంకిడి మండలం బంబార పరిధిలోని పెవుట గ్రామ శివారులో 2012లో చెరువు నిర్మాణం చేపట్టి కాలువలను నిర్మించారు. చెరువు నిర్మాణంతో 13 మంది రైతులకు సంబంధించిన 70 ఎకరాల భూమిని సేకరించారు. అప్పట్లో ప్రభుత్వం ఎకరానికి రూ. 80 వేల చొప్పున నష్టపరిహారంగా చెల్లించింది. దీంతో రైతులు ప్రభుత్వం తమ భూములకు తక్కువ పరిహారం చెల్లించిందని 2013లో ఆసిఫాబాద్‌ సివిల్‌ కోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న కోర్టు 2020లో 13 మంది బాధిత రైతులకు రూ. 2,24,58,137 చెల్లించాలని సివిల్‌ కోర్టు తీర్పునిచ్చింది. రైతులకు పరిహరం చెల్లింపు విష యంలో ప్రభుత్వం జాప్యం చేయడంతో ఆర్డీవో కార్యాలయ ఆస్తులు జప్తు చేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బుధవారం కోర్టు సిబ్బంది ఆర్డీవో కార్యాలయంలోని సామగ్రిని జప్తు చేశారు.

Updated Date - Jul 23 , 2025 | 11:10 PM