ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
ABN , Publish Date - Oct 08 , 2025 | 10:41 PM
తొలి విడతలో 115 ఎంపీటీసీ, 10 జ డ్పీటీసీ స్థానాలకు సంబంధించిన ఎన్నిక లకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ బ దావత్ సంతోష్ తెలిపారు.
- కలెక్టర్ బదావత్ సంతోష్
నాగర్‌కర్నూల్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యో తి) : తొలి విడతలో 115 ఎంపీటీసీ, 10 జ డ్పీటీసీ స్థానాలకు సంబంధించిన ఎన్నిక లకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ బ దావత్ సంతోష్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిష నర్ ఐ.రాణికుముదిని ఇతర ఉన్నతాధికా రులతో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరె న్స్‌లో నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ వీడియో కాన్ఫ రెన్స్ హాల్ నుంచి డిప్యూటీ సీఈవో గోపాల్ నా యక్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీరాములుతో కలిసి ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్‌లు పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ మాట్లా డుతూ నాగర్‌కర్నూల్ జిల్లాలో తొలి విడతలో జరిగే 115ఎంపీటీసీ, 10 జడ్పీటీసీ స్థానాలకు జరిగే ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సిబ్బంది కి శిక్షణ తరగతులు చేపట్టినట్లు కలెక్టర్ వివ రించారు. జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీలకు సం బంధించి మొదటి విడతలో 115 ఎంపీటీసీ, 10 జడ్పీటీసీ స్థానాలకు జరిగే ఎన్నికలకు అవసర మైన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు వివరించారు. ప్రతీ మండల కేంద్రంలో నిర్వహించే ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు కావాల్సిన అన్ని ఏర్పా ట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. నేడు ఎన్నికల అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు కలెక్టర్ ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల అధికా రికి వివరించారు.