kumaram bheem asifabad- కంకాలమ్మ జాతరకు ఏర్పాట్లు
ABN , Publish Date - Nov 07 , 2025 | 10:31 PM
చుట్టూ పచ్చదనం.. మధ్యంలో ఒక ఎతైన గుట్ట. వాటి మధ్య శివపార్వతులు కంకాలమ్మకేతేశ్వరులుగా భక్తులకు దర్శనమిస్తారు. కౌటాల మండల కేంద్రం సమీపంలో ఎత్తైన గుట్టపై ఉన్న కంకలమ్మ దేవాలయం భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. కోరినకోరికలు తీర్చే కల్పతరువుగా కంకాలమ్మ కేతేశ్వర్లు పూజలందుకుంటున్నారు.
- ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు
కౌటాల, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): చుట్టూ పచ్చదనం.. మధ్యంలో ఒక ఎతైన గుట్ట. వాటి మధ్య శివపార్వతులు కంకాలమ్మకేతేశ్వరులుగా భక్తులకు దర్శనమిస్తారు. కౌటాల మండల కేంద్రం సమీపంలో ఎత్తైన గుట్టపై ఉన్న కంకలమ్మ దేవాలయం భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. కోరినకోరికలు తీర్చే కల్పతరువుగా కంకాలమ్మ కేతేశ్వర్లు పూజలందుకుంటున్నారు. వందల ఏళ్ల నాటి చరిత్రను కలిగిన ఈ ఆలయం గత దశాబ్ద కాలంగా అత్యంత వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. అయితే దేశంలో కంకలమ్మ కేతేశ్వరస్వామి ఆలయాలు రెండే ఉండగా స్వయంభూ గా వెలిసిన ఆలయాల్లో కౌటాల కంకాలమ్మ క్షేత్రం మొదటిదిగా కాగా, కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గలో మరో ఆలయం ఉంది. కానీ అది స్వయంభు కాక పోగా నిర్మితం జరిగింది కావడంతో స్వయంభుగా వెలిసిన కౌటాల క్షేత్రం మహాత్యంపైనే భక్తులకు ప్రగాఢ విశ్వాసం. ఏటా కార్తీక మాసంలో కౌటాల కంకాలమ్మ ఆలయ ప్రాంగణంలో మూడు రోజుల పాటు నిర్వహించే జాతర ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్రంలోని భక్తులే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడం ఇందుకు నిదర్శణం. కంకాలమ్మ జాతరకు చేరుకునేందుకు మొదట కౌటాల నుంచి వెళ్లాలి.
- ఆలయానికి విశేష చరిత్ర..
దశాబ్దాల క్రితం ఈ ఆలయ నిర్మాణాన్ని ఒకే రాత్రి రాక్షసులు నిర్మించినట్లు పూర్వీకులు చెబుతుంటారు. కాగా ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన భారీ ఆకారంలోని రాళ్లు ఈ ప్రాంతంలో ఎక్కడ కనిపించవు. ఈ రాళ్లను కనీసం 20 మంది కలిసి ఎత్తినా ఎత్తలేని పరిస్థితి ఉండగా ఆనాడు ఏ విధంగా ఈ ఆలయాన్ని నిర్మించారని ప్రతి ఒక్కరి ఆలోచించే పరిస్థితులు నెలకొన్నాయి. ఆలయంలోని దేవతా విగ్రహాలను కొందరు దొంగలించుకుపోతుండగా మేదరి కులానికి చెందిన మేదరయ్య అనే వ్యక్తి అడ్డు తగలగా ఆ దొంగలు అతని శిరస్సు ఖండించినట్లు ఆనవాళ్లుగా అక్కడున్న విగ్రహాలను బట్టి తెలుస్తోంది. కాగా దొంగలించుకు పోయిన విగ్రహాలు లభించక పోయినా అమ్మవారి శక్తి ఇక్కడే ఉందని భక్తులు ప్రగాఢ విశ్వాసం. కంకాలమ్మ గిరిపై ఉన్న ఆలయం 2000 సంవత్సరం నుంచి ప్రాచూర్యంలో వచ్చింది. అయితే కంకాలమ్మ కేతేశ్వర స్వామికి మొక్కులు సమర్పించి కోరికలు కోరుకున్నట్లయితే ఇట్టే నెరవేరుతాయని చెబుతారు.
- భారీ ఏర్పాట్లు..
కౌటాల మండల కేంద్రంలోని కంకాలమ్మ ఆలయ ప్రాంగణంలో ఈ నెల 13 నుంచి 18 వరకు జాతర మహోత్సవాలు నిర్వహించడానికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ నెల 13న క్షేత్రాధిదేవతల ప్రత్యేక పూజలు, ధ్వజోరహణ, కాల సూచిక ఆవిష్కరణ, 14న కుంకు మార్చన, మహా మంగళ హారతి, మంత్ర పుష్ప, 15న కంకలమ్మ మహాయజ్ఞం, కుష్మాండ బలిహారణము, కళాన్యాసం, 16న మహాజాతర ఉత్సవం, 17న అభిషేకం, అర్చన, జాతర మహోత్సవం రెండో రోజు, 18న ముగింపు కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
ఏర్పాట్లు చేస్తున్నాం..
- సుల్వ కనకయ్య, ఆలయ కమిటీ చైర్మన్
కంకాలమ్మ జాతరకు ఏర్పాట్లు చేస్తున్నాం. స్వయంభూగా వెలిసిన కంకాలమ్మ భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. అమ్మవారిని కోరికలు కోరుకున్నట్లయితే తప్పకుండా నెరవే రుతాయని భక్తుల నమ్మకం. దీంతో ఆలయానికి ప్రతి నిత్యం భక్తులు వస్తుంటారు. ప్రత్యేక రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. స్థానికులతో పాటు దూరప్రాం తాల నుంచి కూడా భక్తులు ఇక్కడి వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.