Share News

kumaram bheem asifabad- అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలి

ABN , Publish Date - Nov 07 , 2025 | 10:29 PM

జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో శుక్రవారం ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి అన్ని మండలాల తహసీల్దార్‌తో జాతీయ కుటుంబ ప్రయోజన పథకం అమలు, మీ సేవ ధ్రువప త్రాలు, సాదాబైనామా, భూభారతి దరఖాస్తుల పెండింగ్‌, నూతన మీ సేవా కేంద్రాల ఏర్పాటు, ప్రధాన మంత్రి జన్‌మన్‌ పథకం కింద పీవీటీజీలకు ఇళ్ల నిర్మాణం అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు

kumaram bheem asifabad- అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌రూరల్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో శుక్రవారం ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి అన్ని మండలాల తహసీల్దార్‌తో జాతీయ కుటుంబ ప్రయోజన పథకం అమలు, మీ సేవ ధ్రువప త్రాలు, సాదాబైనామా, భూభారతి దరఖాస్తుల పెండింగ్‌, నూతన మీ సేవా కేంద్రాల ఏర్పాటు, ప్రధాన మంత్రి జన్‌మన్‌ పథకం కింద పీవీటీజీలకు ఇళ్ల నిర్మాణం అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద కుటుంబ పెద్ద మరణించిన కుటుంబాలకు రూ.20 వేల ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. అర్హత కలిగిన కుటుంబాల నుంచి తహసీల్దార్‌లు దరఖాస్తులు స్వీకరించి సబ్‌ కలెక్టర్‌, ఆర్డీవో కార్యాలయాల్లో సమర్పించాలని తెలిపారు. జిల్లాలో సుమారు మూడు వేల కుటుంబాలు ఆర్థిక సహయం పొందే అవకాశం ఉందన్నారు.. భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో లేకుండా త్వరగా పరిష్కరించాలని సూచించారు. మీసేవా కేంద్రాల ద్వారా వివిధ రకాల ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నిబంధనల ప్రకారం నిర్ణిత గడువులోగా జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా చూడాలని తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో నూతన మీ సేవా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సిఫారసు చేయాలని ఆదేశించారు. ప్రధాన మంత్రి జన్‌మన్‌ పథకంలో భాగంగా పీవీటీజీలకు నివాస గృహాలు, ఇందిరమ్మ ఇళ్ల పనులలో సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ త్వరగా పూర్తి చేసే విధంగా దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో చేయూత పెన్షన్‌ విభాగం ప్రాజెక్టు మేనేజర్‌ రామకృష్ణ, తహసీల్దార్లులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 07 , 2025 | 10:29 PM