Share News

kumaram bheem asifabad- దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ABN , Publish Date - Aug 18 , 2025 | 10:40 PM

న్వయంతో కృషి చేసి త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో ఆసిఫాబాద్‌ ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.

kumaram bheem asifabad-  దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
దరఖాస్తులను స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్‌ డేవిడ్‌

ఆసిఫాబాద్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణిలో అందిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేసి త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో ఆసిఫాబాద్‌ ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కాగజ్‌నగర్‌ మండలం నజ్రుల్‌నగర్‌కు చెందిన మీరా రాణి మండల్‌ తన పేరిట గల లావుని పట్టా భూమిని తన తమ్ముడు పట్టా చేసుకున్నందున విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని దరఖాస్తు అందజేశారు. మిత్ర సర్వీసెస్‌ మేనేజింగ్‌ పార్ట్నర్‌ కొండగుర్ల చంద్రశేఖర్‌ అవుట్‌ సోర్సింగ్‌ పోస్టులను సమానంగా కేటాయించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఆసిఫాబాద్‌ మండలం బూర్గుడ గ్రామానికి చెందని రైతులు తమ గ్రామం గుండా నాలుగు వరుసల రహదారి పక్కన ఖాళీ స్థలాలను ఆక్రమించు కున్నందున వ్యవసాయ చేనులో వస్తున్న వరద నీరు పోకుండా ఆగిపోవడంతో పంట నష్టం జరుగుతుందని, చర్యలు తీసుకోవాలని అర్జీ సమర్పించారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌కు చెందిన పెంటన్న తన తండ్రి వాచ్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తూ మరణించినందున వారసత్వం ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని దరఖాస్తు అందజేశాడు. ఆసిఫాబాద్‌ మండలం వెకంటాపూర్‌ గ్రామానికి చెందిన పుల్లయ్య సాలెగూడ శివారులో అక్రమంగా పట్టా చేసిన వాటిని రద్దు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఆసిఫాబాద్‌ మండలం జెండాగూడ గ్రామానికి చెందిన నర్సింగ్‌రావు తన పూర్వీకుల నుంచి వచ్చిన భూమిని పట్టా చేసి పాసు పుస్తకాలు జారీ చేయాలని కోరుతూ ఆర్జీ సమర్పించారు. ఆసిఫాబాద్‌ మండలం దస్నాపూర్‌కు చెందిన పురుషోత్తం తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Aug 18 , 2025 | 10:40 PM