Share News

చిన్న తరహా నీటి పథకాలపై పట్టింపేది..

ABN , Publish Date - Jul 06 , 2025 | 11:32 PM

సాగునీరు అందని ప్రాంతాల్లో ఆయకట్టుకు నీరిచ్చి అక్కడి రైతు లను ఆదుకోవాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన చిన్నతర హా ఎత్తిపోతల పఽథకాలు నిరాధరణకు గురవుతున్నా యి. నాసిరకపు పనులు, మరమ్మతుల్లో నిర్లక్ష్యం కార ణంగా ట్రయల్‌ రన్‌కే పరిమితం కాగా రూ. కోట్లు వె చ్చించి చేపట్టిన పనులు రైతులకు ఏ మాత్రం ఉప యోగపడకుండా పోయాయి.

చిన్న తరహా నీటి పథకాలపై పట్టింపేది..

స్టేజ్‌-2 దశలోనే నిలిచిన పనులు

అర్ధాంతరంగా నిలిచిన సుందరశాల ఎత్తిపోతల పథకం

-మరమ్మతులు చేపడితే రైతులకు ఉపయోగకరం

మంచిర్యాల, జూలై 6 (ఆంధ్రజ్యోతి): సాగునీరు అందని ప్రాంతాల్లో ఆయకట్టుకు నీరిచ్చి అక్కడి రైతు లను ఆదుకోవాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన చిన్నతర హా ఎత్తిపోతల పఽథకాలు నిరాధరణకు గురవుతున్నా యి. నాసిరకపు పనులు, మరమ్మతుల్లో నిర్లక్ష్యం కార ణంగా ట్రయల్‌ రన్‌కే పరిమితం కాగా రూ. కోట్లు వె చ్చించి చేపట్టిన పనులు రైతులకు ఏ మాత్రం ఉప యోగపడకుండా పోయాయి. వాగులు, వంకలు, నదు ల్లో వృధాగా పోతున్న నీటిని పంట పొలాలకు మళ్లిం చే ఉద్దేశ్యంతో చెన్నూరు మండలం సుందరశాలలో ని ర్మించిన చిన్న తరహా నీటి ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభానికి నోచుకోక ముందే ఆగిపోవడం రైతుల ఆ శలపై నీళ్లు చల్లినట్లయింది. అధికారుల పట్టింపులేని తనం....కాంట్రాక్టరు నిర్లక్ష్యం మూలంగా ఏళ్ల తరబడి పనులు కొనసాగగా, చివరకు నీళ్లందకుండానే మూ లన పడింది.

రూ. 8.27 కోట్ల అంచనా వ్యయంతో....

చెన్నూరు మండలం సుందరశాల సమీపంలోని గో దావరి ఒడ్డున రూ. 8.27 కోట్ల అంచనా వ్యయంతో చిన్న తరహా నీటి ఎత్తిపోతల పథకానికి రూప కల్పన జరిగింది. మండలంలోని సుందరశాల, దుగ్నేపల్లి, వెం కంపేట గ్రామాల్లోని 2260 ఎకరాలకు సాగునీరు అం దించే లక్ష్యంతో 2008లో ఎత్తిపోతల పధకం పనులు ప్రారంభించారు. రెండు విడుతల్లో చేపట్టవలసిన పను ల్లో తీవ్ర జాప్యం జరిగి దాదాపు ఐదు సంవత్సరాల అనంతరం 2013 వరకు కొనసాగాయి. పనులను ఎప్ప టికప్పుడు పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోక పోవడంతో గుత్తేదారు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. దీంతో పనుల్లో నాణ్యత లోపించగా ఆరంభంలోనే ట్రా న్స్‌ఫార్మర్‌ యార్డు ప్రహరీ, ర్యాంప్‌, పిల్లర్లలో పగుళ్లు తేలాయి. దీంతో అప్పుడే వాటిని తొలగించిన అధికారు లు తిరిగి నిర్మించలేదు. పైగా 2014 వరకు హఠాత్తుగా పనులను నిలిపివేశారు. ఆ తరువాత తిరిగి నిర్మాణ పనులు ప్రారంభించినా...పూర్తికాలేదు. స్టేజ్‌-1 పనులు దాదాపుగా పూర్తి చేసినప్పటికీ స్టేజ్‌-2 పనులు అసం పూర్తిగా ఉన్నాయి. పంప్‌ హౌజ్‌ నిర్మాణం పూర్తయినా అందులో నీటిని ఎత్తి పోసేందుకు విద్యుత్తు మోటార్ల బిగింపు పూర్తిస్థాయిలో జరగలేదు. పంప్‌ హౌజ్‌ నుం చి డిస్ట్రిబ్యూటరీ (స్టేజ్‌-2) ట్యాంకు వరకు ఏర్పాటు చే సిన నాలుగు లైన్ల పైపులైన్‌ పనుల్లో ఒకటి పూర్తికాగా గతంలోనే ట్రయల్‌ రన్‌ నిర్వహించారు.

నీరందకుండానే నిలిచిన పనులు..

పంప్‌ హౌజ్‌ వద్ద మిగతా మూడు లైన్ల పనులు చే పట్టాల్సి ఉండగా, అర్థాంతరంగా నిలిపివేశారు. పంట పొలాలకు సాగునీరు అందించే పైప్‌లైన్‌ నిర్మాణ ప నులు కూడా పూర్తికాలేదు. మరో కిలో మీటర్‌ వరకు పనులు చేపట్టవలసి ఉండగా పంట పొలాలకు సాగు నీరు అందకుండానే పనులు నిలిచిపోయాయి. ఐదేళ్లు గా పనులు తిరిగి ప్రారంభించకపోవడం, మధ్యకాలం లో కాళేశ్వరం ప్రాజెక్టుల సముదాయంలో భాగంగా అ న్నారం బ్యారేజీ నిర్మించడంతో పనులు పూర్తిగా మరు గున పడ్డాయి. మరోవైపు అన్నారం బ్యారేజీ బ్యాక్‌ వా టర్‌లో సుందరశాల ఎత్తిపోతల పథకం ముంపునకు గురైంది. పంప్‌ హౌజ్‌లోని విద్యుత్తు మోటార్లు, ఇతర సామగ్రి నీటిలో మునిగి పనికిరాకుండా పోయాయి. దీంతో ఇటీవల ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన సం బంధిత అధికారులు మరమ్మతులు చేయడం సాధ్యం కాదని తేల్చినట్లు సమాచారం. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుల సముదాయంలో నీరు నిలువ చేయాల్సిన పరిస్థితులు పూర్తిగా కనుమరుగయ్యాయి. ఈ క్రమం లో సుందరశాలలోని ఎత్తిపోతల పథకం మరమ్మతు లు చేపడితే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రూ. 1658 కోట్ల వ్యయంతో చెన్నూర్‌ నియోజకవర్గం పరిధిలో దాదాపు లక్ష ఎకరాలకు నీరు అందించే చెన్నూరు ఎత్తిపోతల పథకానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూప కల్పన చేయడంతో సుందరశాల చి న్న తరహా పథకానికి మరమ్మతులు చేపట్టడం వృధా అనే భావనకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆ పథ కం కథ కంచికి చేరగా, వివిధ పనుల కోసం వెచ్చించి న కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అయ్యాయి. విద్యుత్‌ తీగలు, ఇతర విలువైన పరికరాలు దొంగల పాలయ్యాయి. మరోవైపు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్ణ యించిన మేరకు రూ. 1658 కోట్ల ఎత్తిపోతల పథకం కూడా నిర్వీర్యం అయింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ మా టే ఎత్తడానికి సుముఖంగా లేదు. దీంతో ఆ ప్రాజెక్టు కథ సైతం కంచికే చేరినట్లయింది. బీఆర్‌ఎస్‌ హయాం లో చేపట్టిన రెండు పథకాలు అర్థాంతరంగా నిలిచిపో గా, సుందరశాలలోని పాత పథకం పనులైనా చేపట్టా లనే డిమాండ్లు ఉన్నాయి. ఈ విషయమై చెన్నూరు ని యోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి గడ్డం వివేకానంద దృష్టిసారించాలనే విజ్ఞప్తులు ఉన్నాయి.

Updated Date - Jul 06 , 2025 | 11:32 PM