Apollo Executive Vice Chairman Shobana Kamineni: రాష్ట్ర వైద్య రంగంలోమా పెట్టుబడి 1,700 కోట్లు
ABN , Publish Date - Dec 09 , 2025 | 03:55 AM
తెలంగాణ వైద్య రంగంలో వచ్చే మూడేళ్లలో 1,700 కోట్లు పెట్టుబడి పెడుతున్నామని.. ప్రోటాన్ థెరపీ, ఇన్నోవేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అపోలో....
అపోలో ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ శోభన కామినేని వెల్లడి
హైదరాబాద్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ వైద్య రంగంలో వచ్చే మూడేళ్లలో 1,700 కోట్లు పెట్టుబడి పెడుతున్నామని.. ప్రోటాన్ థెరపీ, ఇన్నోవేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అపోలో ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ శోభన కామినేని తెలిపారు. తమ సంస్థ ‘ఆస్క్ అపోలో’ అనే ఐటీ మోడల్‌ను అభివృద్ధి చేసిందని.. ఆరోగ్య రంగంలో అంతర్జాతీయ స్థాయి సాంకేతికత జెమిని కంటే కూడా ఇది అద్భుతంగా పనిచేస్తోందని చెప్పారు. ఇది మన దేశ సత్తా, హైదరాబాద్ సృజనాత్మక శక్తి అని పేర్కొన్నారు. భారత్ అత్యంత వేగంగా సృజనాత్మక ఆవిష్కరణలను అందించగల దేశమని.. అందులోనూ తెలంగాణ ఉత్తమ వేదికగా మారిందని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ సహకారంతో ఆరోగ్య రంగం వేగంగా విస్తరిస్తోందని తెలిపారు. దేశంలోని ఫార్మా కంపెనీల్లో మూడోవంతు తెలంగాణలోనే ఉన్నాయని, ప్రపంచానికి ఎగుమతి అవుతున్న వ్యాక్సిన్లలో మూడో వంతు రాష్ట్రం నుంచే వెళ్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఏర్పడిన జీనోమ్ వ్యాలీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఐడీపీఎల్ వంటి కంపెనీలు, ఇతర పరిశోధన సంస్థలు, ఇక్కడ మౌలిక వసతులే కారణమని చెప్పారు. ‘‘సీఎం రేవంత్‌రెడ్డి చాలా ఎనర్జిటిక్ లీడర్. ఆయన ఏం చేసినా అందులో ఒక ప్రత్యేక ఎనర్జీ కనిపిస్తుంది. ఆయన విజన్ చూస్తుంటే ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీతో కలిసి గోల్ కొట్టినంత కిక్ వస్తుంది. సీఎం రేవంత్ విజన్‌తో హైదరాబాద్ దేశంలోనే వేగంగా ఎదుగుతున్న నగరాల్లో ఒకటిగా మారింది’’ అని శోభన కామినేని పేర్కొన్నారు.