kumaram bheem asifabad- అన్నాభావు సాఠే ఆశయాల సాధనకు పాటుపడాలి
ABN , Publish Date - Aug 17 , 2025 | 10:24 PM
అన్నాభావు సాఠే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్‌రావ్ అన్నారు. మండల కేంద్రంలోని గణేశ్‌నగర్ కాలనీలో ఆదివారం అన్నాభావు సాఠే విగ్రహానికి జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్‌రావ్, సహకార చైర్మన్ కొడప హన్ను పటేల్, అన్నాభావు సాఠే అసోసియేషన్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ఉద్దవ్ కాంబ్లే తదితరులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
జైనూర్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): అన్నాభావు సాఠే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్‌రావ్ అన్నారు. మండల కేంద్రంలోని గణేశ్‌నగర్ కాలనీలో ఆదివారం అన్నాభావు సాఠే విగ్రహానికి జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్‌రావ్, సహకార చైర్మన్ కొడప హన్ను పటేల్, అన్నాభావు సాఠే అసోసియేషన్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ఉద్దవ్ కాంబ్లే తదితరులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఉద్దవ్ కాంబ్లే మాట్లాడారు. సమాజంలో ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలని అన్నారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. అన్నాభావు సాఠేకు భారత రత్న అవార్డును ప్రధానం చేయాలని డిమాండ్ చేశారు. అన్నాభావు సాఠే దేశ విదేశాల్లో తను రచించిన సాహిత్యంతో ప్రఖ్యాతి గాంచారని గుర్తు చేశారు. అంతకు ముందు విదర్భ గాయకుడు సంబాజీ ఢగ్గే కవ్వాలి పాటలు అలరించాయి. కార్యక్రమంలో మాంగ్ సమాజం జిల్లా అధ్యక్షుడు దత్త మవాలె, అంబేద్మర్ అసోసియేషన్ అధ్యక్షుడు కాంబ్లే బాబా సహేబ్, మాజీ అధ్యక్షుడు కాంబ్లే అన్నారావ్, జిల్లా నాయకులు, డాక్టర్ ఘాటె రామారావ్, విజయ్ పుల్లారె, కమిటీ సభ్యులు శ్రీ హరి కొటంబె, గున్వంత్ కొటంబె, మవాలె భారత్, దుదానె కరణ్, సోపాన్‌రావ్ పుల్లారె, నాగోరావ్ కాంబే భుతాలె వెంకటేష్, భుతాలె కిరణ్, వాగ్మారె హన్యంత్, మాతంగ్ రుషి జిల్లా నాయకుడు పండరీ సూర్యవంశీ, సభ్యులు వామన్ వాగ్మారె, కల్వలె అర్వీంద్, సుముక్‌వార్ నర్సింగ్, ధడెకర్ దయానంద్, ధడెకర్ శివానద్, జనార్ధన్ నిర్దుడే తదితరులు పాల్గొన్నారు.