Share News

kumaram bheem asifabad- అన్నా.. ఓటెయ్యడానికి రావాలే..

ABN , Publish Date - Dec 12 , 2025 | 01:05 AM

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటుకు కూడా సర్పంచ్‌ స్థానాలను తారు మారు చేసే శక్తి ఉంటుంది. దీంతో అభ్యర్థులు నాన్‌ లోకల్‌ ఓటర్లకు ఫోన్లు చేసి సంప్రదిస్తున్నారు. రెండో విడతలో కౌటాల, చింతలమానేపల్లి, దహెగాం, పెంచికలపేట, సిర్పూర్‌(టి), బెజ్జూరు మండలాల్లోని 113 పంచాయతీల్లో ఎన్నికలు జరుగున్నాయి.

kumaram bheem asifabad- అన్నా.. ఓటెయ్యడానికి రావాలే..
లోగో

- దూర ప్రాంతల్లో ఉన్న వారిని రప్పించడానికి ప్రయత్నాలు

- రెండో విడతలో 113 పంచాయతీల్లో ఎన్నికలు

కౌటాల, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటుకు కూడా సర్పంచ్‌ స్థానాలను తారు మారు చేసే శక్తి ఉంటుంది. దీంతో అభ్యర్థులు నాన్‌ లోకల్‌ ఓటర్లకు ఫోన్లు చేసి సంప్రదిస్తున్నారు. రెండో విడతలో కౌటాల, చింతలమానేపల్లి, దహెగాం, పెంచికలపేట, సిర్పూర్‌(టి), బెజ్జూరు మండలాల్లోని 113 పంచాయతీల్లో ఎన్నికలు జరుగున్నాయి. నామినేషన్‌ వేసిన అభ్యర్థులు గ్రామాల నుంచి తర ప్రాంతాలకు ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం వలస వెళ్లిన వారికి ఫోన్‌ చేసి అన్నా.. బాగున్నారా... ఎక్కడ ఉన్నారు.. ఎన్నికల్లో సర్పంచ్‌గా, వార్డు సభ్యుడిగా నామినేషన్‌ వేసి పోటీలో నిలబడ్డామని పోలింగ్‌ రోజుకు ఒక రోజు ముందు గ్రామానికి వచ్చి ఓటు వేసి వెళ్లాలని బతిమిలాడుకుంటున్నారు. రాను పోను ఖర్చులు సైతం భరిస్తామని కొన్ని గ్రామాల సర్పంచ్‌ అభ్యర్థులు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. గ్రామాల్లో ఎన్నికల సందడితో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఓట్ల కోసం విధులు ఏర్పాటు చేసి అభ్యర్థులు తమ వైపు తిప్పుకుంటు న్నారు. ఎన్నికలు జరిగే వరకు పూర్తి ఖర్చులు భరిస్తూ తమ వెంట తిప్పుకుంట ున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రచారం నిర్వహించి వెంట తిరిగిన వారికి ప్రత్యేకంగా వారికి నగదుతో పాటు విందులు ఏర్పాటు చేసి ఖుషీ చేస్తున్నారు.

హోరాహోరీగా ప్రచారం..

ఐదు మండలాల్లో సర్పంచ్‌, వార్డు స్థానాలకు బరిలో ఉన్న అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల పోలింగ్‌ దగ్గర పడుతున్న కొద్ది గ్రామాల్లో బరిలో నిలిచిన నేతలు ఎవరి వారు గెలుపుకు దిశగా ముందుకు సాగుతున్నారు. పోలీలో ఉన్న అభ్యర్థులు ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా ప్రచారానికి వినియోగించుకుం టున్నారు. ఏ కుటుంబంలో ఎక్కువ ఓట్లు ఉన్నాయో ఎక్కువ సార్లు కలిస్తే తమకే ఓట్లు వేస్తారో వారిని కలుస్తున్నారు. ప్రతీ ఒక్కరిని అప్యాయతతో పలుకరిస్తూ ముందుకు సాగుతున్నారు. కాగా గ్రామాల్లో ఓట్లు రాబట్టుకునేందుకు నామినేషన్‌ వేసిన అభ్యర్థులు నానా తిప్పలు పడుతున్నారు. ఉదయం నుంచే ఇళ్లలోకి వెళ్లి పలకరించి ఓటు అభ్యరి ్థస్తున్నారు. గతంలో ఎడమొఖం పెడముఖంతో ఉన్న వారిని సైతం ఎన్నికల వేళ కలిసి మాట్లాడుతున్నారు. గతంలో జరిగిన విషయాలను మరిచి పోయి ఎన్నికల్లో తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఉపాధి నిమిత్తం పట్టణాలకు వెళ్లిన ఓటర్లు సైతం కీలకమవుతున్నారు. ఎప్పుడు బయలు దేరుతున్నారు అంటూ అభ్యర్థులు వాకబు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో సైతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పెళ్లి ఆహ్వాన పత్రాలు పంపినట్లుగా వాట్సప్‌ గ్రూపుల్లో ఓటర్లకు తమ అభ్యర్థి తరపున సందేశాలు పంపిస్తున్నారు. అన్నా పోలింగ్‌ రోజు తప్పకుండా గ్రామానికి రావాలి మీ అమూల్యమైన ఓటు వేయాలి.. అంటూ మెసెజులు వెల్లువెత్తుతున్నాయి. ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారు.. ఎక్కడ ఉంటున్నారు... ఎప్పుడు వస్తారు... ఎలాంటి వాహనాలు ఏర్పాటు చేయాలి.. అనే పనిలో అభ్యర్థుల అనుచరులు నిమగ్నమయ్యారు. మరికొందరు అభ్యర్థులు తమ ఓటర్లకు వ్యక్తిగతంగా ఫోన్‌ చేసి మద్దతు కోరుతున్నారు. వలసల పెరుగుదలతో ఇప్పుడు గ్రామ రాజకీయాల్లో పట్నం ఓటర్ల ప్రభావం పెరిగింది.

Updated Date - Dec 12 , 2025 | 01:05 AM