Ankathi Raju: డీఆర్‌డీఎల్ డైరెక్టర్‌గా అంకతి రాజు బాధ్యతల స్వీకరణ
ABN , Publish Date - Nov 02 , 2025 | 04:09 AM
రక్షణ పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాల డీఆర్‌డీఎల్ హైదరాబాద్ నూతన డైరెక్టర్‌గా విశిష్ట శాస్త్రవేత్త అంకతి రాజు శనివారం బాధ్యతలు స్వీకరించారు...
అల్వాల్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): రక్షణ పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాల (డీఆర్‌డీఎల్) హైదరాబాద్ నూతన డైరెక్టర్‌గా విశిష్ట శాస్త్రవేత్త అంకతి రాజు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఈ, ఐఐటీ ముంబై నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పట్టాలను పొందారు. రక్షణ పరిశోధనలో చేసిన కృషికి అంకతి రాజుకు డీఆర్‌డీవో అగ్ని అవార్డ్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్‌సెల్ఫ్ రిలియన్స్, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తమ శాస్త్రవేత్త పురస్కారం లభించింది. మరోవైపు.. హైదరాబాద్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ (ఏఎ్‌సఎల్) డైరెక్టర్‌గా డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. రాఘవేంద్రరావు ఎన్‌ఐటీ భోపాల్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్, ఎంఐటీ చెన్నై నుంచి ఎరోనాటికల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్, ఎన్‌ఐటీ వరంగల్ నుంచి డాక్టరేట్ పీహెచ్‌డీ పొందారు.