గర్భిణుల్లో రక్తహీనతను అరికట్టాలి : డీఎంహెచ్‌వో
ABN , Publish Date - May 30 , 2025 | 11:43 PM
గర్భిణుల్లో రక్తహీనతను అరికట్టాలని, ప్రతీ గర్భవ తికి కచ్చితంగా వైద్యాధికారి సూచన మేరకు 12 వారాల తర్వాత ప్రసవ ప్రణాళికను త యారు చేసి అమలు పర్చాలని జిల్లా వైద్యా రోగ్య శాఖ అధికారి డాక్టర్ కేవీ స్వరాజ్యలక్ష్మి సూచించారు.
కందనూలు, మే 30 (ఆంధ్రజ్యోతి) : గర్భిణుల్లో రక్తహీనతను అరికట్టాలని, ప్రతీ గర్భవ తికి కచ్చితంగా వైద్యాధికారి సూచన మేరకు 12 వారాల తర్వాత ప్రసవ ప్రణాళికను త యారు చేసి అమలు పర్చాలని జిల్లా వైద్యా రోగ్య శాఖ అధికారి డాక్టర్ కేవీ స్వరాజ్యలక్ష్మి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆశా నోడల్ పర్సన్లకు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ గర్భిణుల్లో రక్తహీనతను అరికట్టడంలో కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవాలని సూచించారు. హైరి స్క్ గర్భవతులను సురక్షిత మాతృత్వం పొందే వరకు వైద్యాధికారులు ప్రత్యేకశ్రద్ధ తీసుకోవా లని సూచించారు. కార్యక్రమంలో జిల్లా టీకాకర ణ అధికారి డాక్టర్ రవికుమార్, ఎంహెచ్‌ఎన్. ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ లక్ష్మణ్, డీపీవో రేణయ్య, డీపీహెచ్‌ఎన్‌వో మంగమ్మ, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ శివ కుమార్, ఏపీవో కొట్ర నిరంజన్, ఆశా నోడల్ పర్సన్లు పాల్గొన్నారు.
దోమలను నివారించాలి
తాడూరు : వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతీ ఒక్కరు తమ ఇంటి ప్రాంగణంలో నీళ్లు మల్లుకోకుండా జాగ్రత్తపడాలని డీఎంహెచ్‌వో డాక్టర్ స్వరాజ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం తాడూ రులో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించి న డ్రైడే కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఇం టి ఆవరణలో పనికిరాని కొబ్బరి చిప్పలు, ప్లాస్టి క్ సీసాలు, పేపర్ కప్పులు వస్తువులు లేకుండా చేసుకోవాలన్నారు. జిల్లా టీకీకరణ అధికారి డా క్టర్ రవికుమార్, వైద్యాధికారి డాక్టర్ సంతోష్ అభిరామ్ పాల్గొన్నారు.