Vijayadashami Pooja Ceremony: ఆంధ్రజ్యోతి ప్రింటింగ్ ప్రెస్‌లోవిజయదశమి పూజలు
ABN , Publish Date - Oct 04 , 2025 | 03:14 AM
విజయదశమి సందర్భంగా మూసాపేట సమీపంలోని రాజీవ్‌గాంధీ నగర్‌లో ఉన్న ‘ఆంధ్రజ్యోతి’ ప్రింటింగ్ ప్రెస్ కార్యాలయంలో..
పాల్గొన్న ఆంధ్రజ్యోతి డైరెక్టర్ వేమూరి ఆదిత్య దంపతులు
బాలానగర్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): విజయదశమి సందర్భంగా మూసాపేట సమీపంలోని రాజీవ్‌గాంధీ నగర్‌లో ఉన్న ‘ఆంధ్రజ్యోతి’ ప్రింటింగ్ ప్రెస్ కార్యాలయంలో గురువారం ఆంధ్రజ్యోతి డైరెక్టర్ వేమూరి ఆదిత్య, వైస్ ప్రెసిడెంట్ శ్రుతి కీర్తి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి అసిస్టెంట్ ఎడిటర్, నెట్‌వర్క్ ఇన్‌చార్జి కృష్ణప్రసాద్, డీజీఎం భరత్ కృష్ణ, ప్రొడక్షన్ విభాగం జీఎం విజయ్‌కుమార్ రావు, డీజీఎంలు రాంప్రసాద్, చినబాబు, ఏజీఎం కోటేశ్వరరావు, ఆర్‌ఎం అనిల్‌కుమార్, సీనియర్ మేనేజర్ రాజేష్, మేనేజర్ శేఖర్, అసిస్టెంట్ మేనేజర్లు విజయ్‌కృష్ణ, భానుప్రకాశ్, మాధవరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.