kumaram bheem asifabad- సైబర్ నేరాలపై ఉక్కుపాదం
ABN , Publish Date - Nov 19 , 2025 | 10:56 PM
సైబర్ నేరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుడుతు న్నారు. కాగజ్‌నగర్ పట్టణంలో ఇటీవల పెరుగుతున్న చోరీలు, సైబర్ నేరాలు ప్రజలను ఆందోళనకు గురి చేశాయి. ఈ కేసులను కాగజ్‌నగర్ పోలీసులు వేగంగా ఛేదిస్తూ అంతర్రాష్ట్ర ముఠాలను అదుపులోకి తీసుకుంటున్నారు.
- ఆన్లైన్ ట్రేడింగ్, లోన్ యాప్స్‌తో కోట్లు మాయం
కాగజ్‌నగర్ టౌన్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): సైబర్ నేరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుడుతు న్నారు. కాగజ్‌నగర్ పట్టణంలో ఇటీవల పెరుగుతున్న చోరీలు, సైబర్ నేరాలు ప్రజలను ఆందోళనకు గురి చేశాయి. ఈ కేసులను కాగజ్‌నగర్ పోలీసులు వేగంగా ఛేదిస్తూ అంతర్రాష్ట్ర ముఠాలను అదుపులోకి తీసుకుంటున్నారు. ఆగస్టు నెలలో కాగజ్‌నగర్‌లో చోటు చేసుకున్న సైబర్ క్రైం కేసు ఛేదించడం గమనార్హం. పక్కా ఆధారాలతో ముగ్గురునిందితుల వాడిన బ్యాంకు ఖాతాలు, వారి లావాదేవీలతో గుజరాత్ రాష్ట్రంలోని అహ్మ దాబాద్‌లో పట్టుకున్నారు. వీరిలో ప్రధాన నిందితులైన కడవల భవేష్ సిదాబాయ్(అహ్మదాబాద్), రాథోడ్ రాహుల్(అహ్మదాబాద్), సాహు సదీప్(అహ్మదాబాద్) ఇటీవల అరెస్టు చేశారు. కాగజ్‌నగర్ డీఎస్పీ వహిదోద్దీన్, సీఐ ప్రేం కుమార్ సిబ్బంది ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. టెక్నికల్ అనాలసిస్, డిజిటల్ ఫుట్ ప్రింట్స్, కాల్ డేటా రికార్డుల ఆధారంగా వారు అనేక రాష్ట్రాలకు ట్రాక్ చేసిన నిందితులను అరెస్టు రిమాండుకు తరలించారు. డీ4సి ఆపరేషన్ పోలీసులు చేపట్టిన అత్యంత వేగవతంతమైన చర్యల్లో ఒకటిగా చెబుతున్నారురు. ఐదేళ్ల క్రితం బాలాజీనగర్‌లో పలు ఇళ్లల్లో చోరీ జరిగింది. ఈ కేసును పోలీసులు లోతుగా అధ్యయనం చేసి అప్పట్లో లభించిన క్లూస్‌ను తాజాగా వచ్చిన డేటాతో సరిపోల్చి కేసును పునఃపరిశీలించి, సరైన వ్యక్తుల కదలికలను సమన్వయం చేసి పక్కా ఆధారాలతో గత కేసులతో పోల్చి ఈనెల 19న ఛేదించారు. ఈ కేసులో 17 తులాల బంగారాన్ని స్వాధీనం చేసి కోర్టులో చోరీకి పాల్పడిన వారిని హాజరు పర్చారు. సొత్తు కూడా రికవరీ చేయించారు. అక్టోబరు నెలలో బతుకమ్మ పండుగ సందర్భంగా పలు ప్రాంతాల్లో చోరికి పాల్పడిన సంఘటన కేసును కేవలం పక్షం రోజుల్లో ఛేదించారు. ఈ కేసులో ప్రధానంగా సీసీ పుటేజీల్లో లభించిన ఆధారాలు, అనుమానస్పద వ్యక్తుల కదలికలను గుర్తించి నలుగురిని అరెస్టు చేశారు. ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఏఎస్పీ చిత్తరంజన్ ఆధేశాల మేరకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి మధ్యప్రదేశ్, గుజరాత్, మహరాష్ట్ర, తదితర రాష్ట్రాల్లోకి వెళ్లి కేసులను ఛేదిస్తున్నారు. ఆసిఫాబాద్ సీఐ బాలాజీ వర ప్రసాద్, కాగజ్‌నగర్ టౌన్ సీఐ ప్రేంకుమార్, కాగజ్‌నగర్ రూరల్ సీఐ కుమార స్వామి, టాస్క్‌ఫోర్స్ సీఐ, ఎస్సైలు సుధాకర్, సందీప్, ప్రశాంత్, యాదగిరి ప్రత్యే క ఆపరేషన్లలో కేసులు ఛేదిస్తున్నారు.
ఇటీవల ఇలా..
- గత నెల 29న ఆన్‌లైన్ కేసులో మోసపోయిన రూ. 45 వేల నుంచి 35 వేలు కేసును చేధించి ఆ మొత్తాన్ని ఫ్రీజ్ చేయించారు. ఈ కేసులో కాగజ్‌నగర్ రూరల్ పోలీసులు ఒక్కరిని అరెస్టు చేసి కాగజ్‌నగర్‌కు తీసుకువచ్చారు.
- ట్రేడింగ్, ఆన్లైన్ పెట్టుబడి పేరిట మోసం మరో నిందితుడిని కాగజ్‌నగర్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మోసంలో వాట్సాప్ గ్రూపు తయారు చేసి 108 మంది చేర్చి 76.50 లక్షలు మోసం చేసి గ్రూపును తొలగించారు.
- కాగజ్‌నగర్ టౌన్‌లోని మరో కేసులో ముగ్గురు నిందితులను గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పట్టుకొని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
- ఆన్‌లైన్ ట్రేడింగ్ కేసులో నవంబరు 16న తిరిగి మరో ఇద్దరు నిందితులను కాగజ్‌నగర్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్, మహారాష్ట్రలోని పుణేలో వీరిని పట్టుకొని రిమాండుకు తరలించారు.
- ఆసిఫాబాద్‌లో ఆన్‌లైన్ కేసులో డబ్బులు పొగొట్టుకొన్న కేసులో 1.66 లక్షల్లో రూ. 60వేలు ఫ్రీజ్‌చే శా రు. ఈ కేసులోనూ నిందితులు ఇద్దరిని గుజరాత్ రాష్ట్రంలో అరెస్టు చేశారు.
- కాగజ్‌నగర్ టౌన్ క్రైం నెం.184/2025 కేసులో ఫేక్ ట్రేడింగ్ కేసులో రూ. 76.50 లక్షలు కోల్పోయిన బాధితుడి కేసులో ఏ-1, ఏ-2లు గతంలో పట్టుబడ్డారు. ఏ-3, ఏ-4లను ఇద్దరిని గుజరాత్‌లో అరెస్టు చేశారు.
ఉన్నతాధికారుల సూచనలతో..
-డీఎస్పీ వహిదుద్దిన్, కాగజ్‌నగర్
ఏ కేసు ఛేదించినా కూడా ఉన్నతాధికారుల సూచనలు, సలహాలు, అలాగే స్థానిక పోలీసుల అందరి సమష్ట కృషితోనే గతంలో జరిగిన కేసులను ఛేదిస్తు న్నాం. పక్కా ప్రణాళికాబద్ధంగా వివరాలు సేకరిస్తున్నాం. ఆధునిక టెక్నాలజీ సహాయంలో క్లూస్ సేకరిస్తున్నాం. కీలక కేసులు పరిష్కరిస్తున్నాం.
సాంకేతికత పరిజ్ఞానంతో,,
-ప్రేమ్‌కుమార్, పట్టణ సీఐ, కాగజ్‌నగర్
ఆధునిక సాంకేతితో చోరీ కేసులను ఛేదిస్తున్నాం. అంతరాష్ట్ర సైబర్ క్రైం ముఠాను కూడా పట్టుకున్నాం. పట్టణంలో ప్రతి దుకాణం వద్ద సీసీ కెమెరాను ఏర్పా టు చేసుకోవాలని సూచిస్తున్నాం. దీని ద్వారా చోరీలు తగ్గుముఖం పడుతాయి. చోరీ జరిగినా సీసీ ఫుటేజీల ఆధారంగా కేసును ఛేదిస్తాం.