Amit Shah to Attend Ganesh Immersion: గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు అమిత్‌షా
ABN , Publish Date - Sep 03 , 2025 | 05:12 AM
హైదరాబాద్‌లో ఈ నెల 6న జరగనున్న గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రానున్నారు. భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు...
6న హైదరాబాద్‌కు.. బీజేపీ ముఖ్య నేతలతో భేటీ
హైదరాబాద్‌లో ఈ నెల 6న జరగనున్న గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రానున్నారు. భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు ఆయన వస్తున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. 6న ఉదయం 11 గంటలకు అమిత్ షా ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఐటీసీ కాకతీయ హోటల్‌లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు చార్మినార్ వద్ద, 3.30 గంటలకు ఎంజే మార్కెట్ వద్ద జరిగే శోభా యాత్రలో పాల్గొంటారు. కాగా, కేంద్ర హోంమంత్రి వినాయక శోభాయాత్రకు వస్తుండటం ఇదే తొలిసారి అని బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.