Share News

వక్ఫ్‌ చట్ట సవరణ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం

ABN , Publish Date - May 21 , 2025 | 11:02 PM

మోదీ నాయక త్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్‌ సవరణ చట్టం భారత రాజ్యాంగ స్ఫూర్తికి పూ ర్తిగా విరుద్ధమని రౌండ్‌ టేబుల్‌ సమావే శంలో పలు పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు అ భిప్రాయపడ్డారు.

వక్ఫ్‌ చట్ట సవరణ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం
జిల్లా కేంద్రంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు

- నాగర్‌కర్నూల్‌లో వక్ఫ్‌ బచావో జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం

- పాల్గొన్న పలు పార్టీలు, ప్రజా సంఘాల వక్తలు

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, మే 21 (ఆంధ్రజ్యోతి) : మోదీ నాయక త్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్‌ సవరణ చట్టం భారత రాజ్యాంగ స్ఫూర్తికి పూ ర్తిగా విరుద్ధమని రౌండ్‌ టేబుల్‌ సమావే శంలో పలు పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు అ భిప్రాయపడ్డారు. బుధవారం వక్ఫ్‌ బచావో జే ఏసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బిన్‌ మహ పుజ్‌ మజీద్‌ ఆవరణలో పార్టీలు, ప్రజా సం ఘాల నాయకులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. వక్ఫ్‌ కాంప్లెక్స్‌ మేనేజింగ్‌ కమి టీ కార్యదర్శి పఠాన్‌ అబ్దుల్లా ఖాన్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు ఆనంద్‌జీ, సీపీ ఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యు డు ఆర్‌.శ్రీనివాస్‌, జైభీం దీక్షా సమితి వ్యవ స్థాపకుడు వంకేశ్వరం నిరంజన్‌, ఎమ్మార్పీఎస్‌ జిల్లా ఇన్‌చార్జి గూట విజయ్‌, కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ సెల్‌ జిల్లా అ ధ్యక్షుడు హబీబ్‌ రహమాన్‌, క్రిస్టియన్‌ మైనార్టీ నాయకుడు సంపత్‌కుమార్‌ పాల్గొని వక్ఫ్‌ సవ రణ చట్టాన్ని ముక్త కంఠంతో వ్యతిరే కించారు. దేశంలో మనువాద సిద్ధాంతాన్ని అమలు చేసే కుట్రల్లో భాగంగానే బీజేపీ వక్ఫ్‌ సవరణ చట్టం తీసుకు వచ్చిందని ఆరోపించారు. ఈ నెల 31న జిల్లా కేంద్రంలోని జెడ్పీ మైదానంలో నిర్వహించ తలపెట్టిన వక్ఫ్‌ చట్ట సవరణ వ్యతిరేక సభను జయప్రదం చేయాలని వారు కోరారు. కార్యక్ర మంలో అవాజ్‌ కమిటీ జిల్లా అధ్యక్షుడు సలీం, బీఎంపీ పార్లమెంటు కన్వీనర్‌ గడ్డం విజయ్‌, ముస్లిం హక్కుల సాధన సమితి అధ్యక్షుడు నిజాం, వక్స్‌ బచావో జేఏసీ నాయకులు హమీ ద్‌, ఖాజామైనుద్దీన్‌, అలీం, నిజాం, సుల్తాన్‌, షేక్‌ ఫరీద్‌ అహ్మద్‌, యాకుబ్‌ బావాజీర్‌, సాధిక్‌ పాషా, హబీబ్‌ఖాన్‌, అనిస్‌ అహ్మద్‌ ఖాన్‌, రఫీ, నసీర్‌ అహ్మద్‌, ఖలీల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2025 | 11:02 PM