Share News

Ragaswara Suprabhatam: అంబికా నుంచి రాగస్వర సుప్రభాతం

ABN , Publish Date - Dec 31 , 2025 | 04:31 AM

అంబికా అగర్‌బత్తి సంస్థ.. రాగస్వర సుప్రభాతం పేరిట మరో వినూత్న ఉత్పత్తిని ఆవిష్కరించింది.

Ragaswara Suprabhatam: అంబికా నుంచి రాగస్వర సుప్రభాతం

  • మరో కొత్త అగర్‌బత్తిని తీసుకొచ్చిన సంస్థ

  • బాక్స్‌ తెరవగానే సుప్రభాతం వచ్చేలా ఏర్పాటు

  • సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో ఆవిష్కరణ

  • అంబికా మరింతగా ప్రజాదరణ పొందాలి

  • ఆకాంక్షించిన త్రిదండి చినజీయర్‌స్వామి

  • నా జన్మ ధన్యమైంది: అంబికా కృష్ణ

శంషాబాద్‌ రూరల్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): అంబికా అగర్‌బత్తి సంస్థ.. రాగస్వర సుప్రభాతం పేరిట మరో వినూత్న ఉత్పత్తిని ఆవిష్కరించింది. ఈ అగర్‌బత్తి బాక్స్‌ తెరిచినప్పుడు సువాసనలు వెదజల్లడమే కాదు.. శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం వినిపించనుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా రాగస్వర సుప్రభాతం అగర్‌బత్తీలను త్రిదండి చినజీయర్‌స్వామి ఆవిష్కరించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో మంగళవారం జరిగిన కార్యక్రమానికి అంబికా సంస్థ చైర్మన్‌ అంబికా కృష్ణ, సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చినజీయర్‌ స్వామి మాట్లాడుతూ అంబికా అగర్‌బత్తి సంస్థ తీసుకొచ్చిన రాగస్వర సుప్రభాతం అగర్‌బత్తీలు మంచి ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. ఏకాదశి రోజున శ్రీ రామచంద్రప్రభుస్వామి సన్నిధిలో ఈ ఉత్పత్తిని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. అగర్‌బత్తి ప్యాకెట్‌ తెరవగానే సుప్రభాతం వినిపించడం.. ఎంతగానో ఆకట్టుకుంటోందన్నారు. అంబికా సంస్థ, వారి ఉత్పత్తులకు 108 దివ్య దేశాల ఆశీస్సులు ఉంటాయన్నారు. దేవుడి సన్నిధిలో అంబికా సేవలు మరింతగా పెరగాలని కోరుకుంటున్నామన్నారు. అంబికా అగర్‌బత్తి సంస్థ చైర్మన్‌ అంబికా కృష్ణ మాట్లాడుతూ ఏకాదశి రోజున చిన జీయర్‌స్వామి చేతుల మీదుగా రాగస్వర సుప్రభాతం అగర్‌బత్తిని ఆవిష్కరింపజేయడంతో తన జన్మ ధన్యమైందన్నారు. సమాజ సేవలో చినజీయర్‌స్వామికి ఎవరూ సాటిలేరని చెప్పారు. స్వామిజీ లేకుంటే 108 దివ్యదేశాలు ఇక్కడ ఉండేవి కావన్నారు. రాగస్వర సుప్రభాతం అగర్‌బత్తీ దేశవ్యాప్తంగా పేరు, ప్రఖ్యాతలు సాధిస్తుందని ఆశిస్తున్నామన్నారు.

Updated Date - Dec 31 , 2025 | 04:31 AM