Share News

రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్‌

ABN , Publish Date - Dec 07 , 2025 | 12:10 AM

భారతదేశానికి మ హోన్నతమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్‌ బీఆర్‌ఎస్‌ అం బేద్కర్‌ అని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో అంబేద్కర్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. అంబే ద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.

రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్‌
అంబేద్కర్‌ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, అధికారులు

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : భారతదేశానికి మ హోన్నతమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్‌ బీఆర్‌ఎస్‌ అం బేద్కర్‌ అని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో అంబేద్కర్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. అంబే ద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన భారతదేశానికి రాజ్యాంగాన్ని అంబేద్కర్‌ అందించారన్నారు. సంఘ సంస్కర్తగా అంటరాని తనాన్ని రూపుమాపేందుకు కృషి చేశారని, న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, ఆర్థిక వేత్తగా ఎన్నో పదవుల్లో దేశానికి సేవలందించారన్నారు. మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్‌ డీడీ చాతరాజుల దుర్గా ప్రసాద్‌, డీఆర్‌డీవో కిషన్‌, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు, వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్‌, జిల్లా సహాకార అధికారి హనుమంతరెడ్డి, కలెక్టరేట్‌ పరిపాలన అధికారి రాజేశ్వర్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2025 | 12:10 AM