kumaram bheem asifabad- పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ABN , Publish Date - Aug 17 , 2025 | 10:22 PM
ఆసిఫాబాద్ పట్టణంలోని శ్రీ వాసవి పాఠశాలలో 1996-2004 వరకు చదువుకున్న విద్యార్థులు పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పుడు చదువుకున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు.
ఆసిఫాబాద్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్ పట్టణంలోని శ్రీ వాసవి పాఠశాలలో 1996-2004 వరకు చదువుకున్న విద్యార్థులు పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పుడు చదువుకున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మిత్రులు అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకన్నారు. అప్పుడు బోధించిన ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహేశ్వర్, ప్రసాద్, బాలకిషన్, సతీష్, చిత్రాని, చందన, తిరుమలరావు, శ్రీనివాస్‌తో పాటు పూర్వ విద్యార్థులు మోహిన్, అఖిల్, హరిత్, శ్రీకర్, చందన్, చైతన్య, నిఖిల, మీన, స్రవంతి, మాధవి, మమత పాల్గొన్నారు.
కాగజ్‌నగర్, (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ బాలభారతి హైస్కూల్ 2002-03 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్ధులు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠాలు బోధించిన గురువులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం చిన్ననాటి జ్ఙాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆట, పాట కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో 2002-03 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.