Share News

విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి

ABN , Publish Date - Nov 24 , 2025 | 11:30 PM

విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని కార్మెల్‌ అకాడమి డైరెక్టర్‌, ఫాదర్‌ డాక్టర్‌ జీవీఆరెక్స్‌ తెలిపారు. సోమవారం పట్టణంలోని కార్మెల్‌ పాఠశాలలో ఇంటర్‌ స్టేట్‌ క్రీ డల ప్రారంబోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వళన చేశారు.

విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి

క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌

మందమర్రిటౌన్‌,నవంబరు24(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని కార్మెల్‌ అకాడమి డైరెక్టర్‌, ఫాదర్‌ డాక్టర్‌ జీవీఆరెక్స్‌ తెలిపారు. సోమవారం పట్టణంలోని కార్మెల్‌ పాఠశాలలో ఇంటర్‌ స్టేట్‌ క్రీ డల ప్రారంబోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వళన చేశారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల నుంచి వచ్చిన టువంటి క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ పోటీలు ప్రదానంగా 8, 9, 10వ తరగతి విద్యార్థులకు సంబంధించినవని తెలిపారు. ఈ పోటిల్లో వాలీబాల్‌, ఖోఖో, బాస్కెట్‌బాల్‌, డ్రాయింగ్‌, డ్యాన్స్‌ పోటీలు ఉంటాయని, అంతేగాకుండా పోయెట్రీ ఉపన్యాసం పోటీలు కూడ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులు గెలుపోటములు ఒకే వి ధంగా తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు విద్యార్థులు వారు ఎంచుకున్న క్రీడలపై సాధన చేస్తేనే విద్యార్థులు విజయాలు సాదిస్తామన్నారు. క్రీడల తో క్రమశిక్షణ కలిగి ఉంటారని తెలిపారు ఉత్తమ ఫలితాలు, క్రీడల్లో విజ యాలతోపాటు పాఠశాలలకు మంచి పేరు ఉంటుందని తెలిపారు. మూ డు రోజుల పాటు జరిగే పోటీల్లో అందరికి మంచి వసతులు కల్పిస్తున్నా మని తెలిపారు. అనంతరం ఆయన క్రీడాకారులకు కరచాలనం అందించి పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మ హారాష్ట్ర నుంచి 30 పాఠశాలలకు చెందిన వెయ్యి మంది విద్యార్థులు హాజ రయ్యారు. ఈకార్యక్రమంలో బిషప్‌ జోషఫ్‌ టప్‌ ఆఫ్‌ పరంబత్‌, ప్రొఫెసర్‌ ప్రాన్స్‌స్‌ జేవీఆర్‌, ప్రొఫెసర్‌ దూసి రవిశేఖర్‌, రజిత కాంచనలి పల్లి, హెల్త్‌కేర్‌ ప్రోవైడర్‌ నెదర్లాండ్‌ హజారయ్యారు. ఈపోటీలు ఉత్కంఠ భరితంగా సాగాయి. పాఠశాల ప్రాంగణమంతా క్రీడాకారులతో కలకళలాడింది.

Updated Date - Nov 24 , 2025 | 11:30 PM