విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి
ABN , Publish Date - Jul 19 , 2025 | 11:26 PM
విద్యార్థులు విద్యతో పా టు క్రీడల్లో రాణించాలని చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వజీర్ సు ల్తాన్ తెలిపారు. శనివారం పట్టణంలోని లిటిల్ ప్లవర్ పాఠశాలలో ని ర్వహించిన చెస్ పోటీలకు ఆయన హాజరై మాట్లాడుతూ చెస్ అసోసి యేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అనేక చెస్ పోటీలు నిర్వహించా మన్నారు.
మందమర్రిటౌన్, జూలై 19 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు విద్యతో పా టు క్రీడల్లో రాణించాలని చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వజీర్ సు ల్తాన్ తెలిపారు. శనివారం పట్టణంలోని లిటిల్ ప్లవర్ పాఠశాలలో ని ర్వహించిన చెస్ పోటీలకు ఆయన హాజరై మాట్లాడుతూ చెస్ అసోసి యేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అనేక చెస్ పోటీలు నిర్వహించా మన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఈ పోటీల ను నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో చెస్ అభివృద్ధికి తమ అసోసియే షన్ కృషి చేస్తుందన్నారు. వేసవిలో ఉచిత చెస్ శిక్షణ శిబిరాలను కూడా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా చైర్మన్ ఈగ కనకయ్య, మధు, సతీష్, పీఈటీ కుమార్,రేణుక పాల్గొన్నారు.
విజేతలకు బహుమతులు
అండర్ 9లో అఖిరానందన్, ఆరీఫ్, హేమంత్, అండర్ 11లో రితికేష్, తన్షి, అక్షయ్, మాన్వి, అండర్ 13లో అఖిల్, రిషివరుణ్, సాత్విత, నవ్య, అండర్ 15లో విశ్వసృజన్, కార్తీక, మహితలు గెలుపొందగా వీరికి బహు మతులు అందించారు.