Share News

kumaram bheem asifabad- వారంలోనే అంతా.. అభ్యర్థుల చింత

ABN , Publish Date - Nov 30 , 2025 | 10:56 PM

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఇచ్చిన షెడ్యూల్‌ లో అభ్యర్థుల తుది జాబితా అనంతరం ప్రచారానికి వారం రోజుల గడువు మాత్రమే మిగులుతోంది. సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యాకనే పోటీలో ఉన్న అభ్యర్థులు తమ ప్రచారం నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన షెడ్యూల్‌ మేరకు మూడు విడతల్లోనూ ఇదే పరిస్థితి ఉందని వాపోతున్నారు. పంచాయతీ ఎన్నికలకు తొలి విడతకు సంబంధించిన నామినేషన్ల గడువు శనివారం ముగిసింది.

kumaram bheem asifabad- వారంలోనే అంతా.. అభ్యర్థుల చింత
లోగో

- సర్పంచుకు 521, వార్డు స్థానాలకు 1,426 మంది బరిలో

- రాత్రి వరకు కొనసాగిన ప్రక్రియ

- పల్లెల్లో వేడెక్కిన రాజకీయం

ఆసిఫాబాద్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఇచ్చిన షెడ్యూల్‌ లో అభ్యర్థుల తుది జాబితా అనంతరం ప్రచారానికి వారం రోజుల గడువు మాత్రమే మిగులుతోంది. సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యాకనే పోటీలో ఉన్న అభ్యర్థులు తమ ప్రచారం నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన షెడ్యూల్‌ మేరకు మూడు విడతల్లోనూ ఇదే పరిస్థితి ఉందని వాపోతున్నారు. పంచాయతీ ఎన్నికలకు తొలి విడతకు సంబంధించిన నామినేషన్ల గడువు శనివారం ముగిసింది. నామినేషన్లు వేసిన అభ్యర్థు లు, వారికి మద్దతు ఇస్తున్న పార్టీల నాయకులు తమకు ఒక్క చాన్స్‌ ఇవ్వాలంటూ ప్రచారం ప్రారంభించారు. దీంతో గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది. తొలి విడతలో 114 గ్రామపంచాయ తీలు, 944 వార్డుల్లో నామినే షన్లను స్వీకరించారు. సర్పంచ్‌, వార్డు స్థానాలకు రాత్రి వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు క్యూలు కట్టారు. సర్పంచ్‌ స్థానాలకు మొత్తం 521, వార్డు స్థానాలకు 1,426 నామినేషన్లు వచ్చాయి. ఆదివారం నామినేషన్ల పరిశీలన చెల్లుబాటు అయిన నామినే షన్ల వివరాలను అధికారులు వెల్ల డించారు. సోమవారం అప్పీళ్ల స్వీకరణ, మంగళ వారం అప్పీళ్ల పరిష్కారం ఉంటుంది. డిసెంబరు 3న నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజు పోటిలో ఉండే అభ్యర్థులను ప్రకటిస్తారు. డిసెంబరు 11న పోలింగ్‌, ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అనంతరం విజేతలను ప్రకటించడం జరుగుతుంది.

- ఐదు మండలాల్లో..

తొలి విడతలో జిల్లాలోని ఐదు మండలాల్లోని 114 సర్పంచ్‌ స్థానాలు, 944 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆయా మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ శనివారం రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. అధిక సంఖ్యలో అభ్యర్థులు ఉండడంతో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఆలస్యమైంది. సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ల గడువు ముగిసిన ఆ సమయానికి క్యూలో ఉన్న అభ్యర్థులకు టోకేన్లు జారీ చేసి నామినేషన్ల దాఖలుకు అనుమతి ఇచ్చారు. దీంతో జిల్లాలో సర్పంచ్‌ స్థానాలకు మొత్తం 521, వార్డు స్థానాలకు 1426 నామినేషన్లు వచ్చాయి.

- ప్రచారానికి వ్యూహరచన..

పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించుకోవడానికి ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు పంచాయతీ అభ్యర్థులు వ్యూహరచన జరుపుతు న్నారు. ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తి కావడం నామినేషన్ల ఉపసంహరణ, గుర్తులు కేటాయించడం వంటి పనులు మిగిలి ఉండడం, ప్రచారానికి కొద్ది రోజులు గడువు ఉండటంతో అభ్యర్థులు ప్రధానంగా ప్రచారం వైపు దృష్టి సారిస్తున్నారు. అభ్యర్థులు ఏర్పాటు చేసుకొవాల్సిన ప్రచార సామాగ్రిని గ్రామస్థాయి నాయకులకు నియోజకవర్గస్థాయి నేతలు వివరిస్తున్నారు. ఓటర్లను అకర్షించడానికి పలు విషయాలను వివరి స్తూ ఇప్పటి వరకు తమ పార్టీ ప్రజాప్రతినిధులు జరిపిన అభివృద్దిని గుర్తు చేయడానికి పార్టీలు సన్నద్దం అవుతున్నాయి. పోలింగ్‌ బూత్‌ల వారీగా ఏజేంట్లను నియామకం చేసి ప్రచారాన్ని పర్యవేక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకుం టున్నారు. తమతమ వర్గానికి అనుకూలంగా ఉండే గ్రామనికి చెందిన ముఖ్య నాయకులను కార్యకర్తలను బూత్‌ల వారీగా నియమించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

- రెండో విడతలో 113..

జిల్లాలో రెండో విడత సర్పంచ్‌, వార్డు స్థానాలకు ఆదివారం నుంచి నామినేషన్లను స్వీకరణ ప్రారం భమైంది. ఈ ప్రక్రియ డిసెంబరు 2 వరకు కొనసాగనుంది. బెజ్జూరు మండలంలోని 22 పంచాయతీలు, 188 వార్డు స్థానాలు, దహెగాం మండలంలోని 24 పంచాయతీలు, 200 వార్డు స్థానాలు, చింతలమానేపల్లిలోని 19 పంచాయతీలు, 176 వార్డు స్థానాలు, కౌటాల మండలంలోని 20 పంచాయతీలు, 182 వార్డు స్థానాలు, పెంచికల్‌పేట మండలంలోని 12 పంచాయతీలు, 102 వార్డు స్థానాలు, సిర్పూర్‌(టి) మండలంలోని 16 పంచా యతీలు 144 వార్డు స్థానాలు ఉండగా మొత్తం 113 గ్రామపంచాయతీలు, 992 వార్డు స్థానాలకు నామినేషన్లను స్వీకరించనున్నారు. డిసెం బరు 2 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 3న నామినేషన్లను పరిశీలించి 6న ఉపసంహరణకు గడువు విధించారు. డిసెంబరు 14న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆయా మండలాల పరిధిలోని సర్పంచ్‌, వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించి, మధ్యాహ్నం 2 గంటల నుం చి ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు.

Updated Date - Nov 30 , 2025 | 10:56 PM