ఒకే చోట అన్ని రకాల న్యాయసేవలు...
ABN , Publish Date - Oct 11 , 2025 | 11:49 PM
ప్ర జలకు న్యాయసేవలను ఒకే చోట అందించాల న్న లక్ష్యంతో భవన సముదాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ అన్నారు.
నస్పూర్‌లో జిల్లా కోర్టు సముదాయ నిర్మాణ పనులు...
వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్
నస్పూర్, అక్టోంబరు 11 (ఆంధ్రజ్యోతి) : ప్ర జలకు న్యాయసేవలను ఒకే చోట అందించాల న్న లక్ష్యంతో భవన సముదాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ అన్నారు. నస్పూర్‌లో రూ. 81 కో ట్ల వ్యయంతో నిర్మించే జిల్లా కోర్టుల భవన స ముదాయ నిర్మాణ పనులను శనివారం హైదరా బాద్ నుంచి వర్చువల్ విధానం ద్వారా చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ప్రారంభించగా, నస్పూర్‌లో హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మి నిస్ర్టేటివ్ జడ్జి నగేష్ భీమపాక భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఛీఫ్ జస్టిస్ మాట్లాడు తూ భవన నిర్మాణ పనులు అన్ని రకాల న్యా య సేవలను ప్రజలకు అందుబాటులోకి తొం దరగానే రానున్నాయన్నారు. నస్పూర్‌లో ఏర్పా టు చేసిన కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజ రైన హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ర్టేటి వ్ జడ్జి నగేష్ భీమపాక మాట్లాడుతూ ఒకే చో ట ప్రజలకు జిల్లా స్థాయిలో అన్ని రకాల న్యా యసేవలు అందుతాయన్నారు. రూ. 81 కోట్ల అంచనా వ్యయంతో భవన నిర్మాణ పనులు మొదలైయ్యాయన్నారు. రెండేళ్ల కాలపరిమితితో జూన్ 2027 నాటికి కోర్టుల భవన సముదా యం పూర్తయ్యే విధంగా ఎప్పటికప్పుడు చర్య లు చేపట్ట నున్నట్లు తెలిపారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ కోర్టుల భవన సముదాయ పనుల నిర్ణీత గడువులోగా కాంట్రాక్టర్ పనులు చేయాలని సూచించారు. భవనం పూర్తయితే న్యాయ సేవలు ప్రజలకు చేరువలోకి వస్తాయ న్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండవ రం జగన్ మాట్లాడుతూ 20 ఏళ్ల కల నేడు సా కారం అయిందన్నారు. కోర్టుల ఏర్పాటుకు తా మేంతో కష్టపడ్డామన్నారు. అంతకు ముందు హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ర్టేటివ్ జ డ్జి నగేష్ భీమపాకకు న్యాయవాదులు, అధికా రులు ఘన స్వాగతం పలికారు. పోలీసుల గౌర వ వందనం స్వీకరించారు. కళాకారులు సంస్కృ తిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వివిధ న్యాయసంఘాల ప్రతినిధులు, న్యాయవవాదులు హైకోర్టు న్యాయమూర్తిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జి వీరయ్య. అదనపు కలెక్టర్ చంద్రయ్య, ఆర్ డీవో శ్రీనివాస్‌రావు, డీసీపీ భాస్కర్, జిల్లా అట వీ శాఖ అధికారి శివ్ అశిష్ సింగ్‌లతో పాటు జిల్లాలోని వివిధ కోర్టుల న్యాయమూర్తులు, వి విధ శాఖల అధికారులు, న్యాయ వాదులు, బా ర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.