రహదారులన్నీ ఆగమాగం
ABN , Publish Date - Jul 05 , 2025 | 01:16 AM
చండూరు మునిసిపాలిటీలో ప్రధాన రహదారులన్నీ అధ్వానంగా మారాయి. చిన్నపాటి వర్షం పడినా పట్టణమంతా చిత్తడిగా మారుతోంది. రహదారులపై ఏర్పడిన గుంతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రహదారులన్నీ ఆగమాగం
అధ్వానంగా చండూరు మండలకేంద్రంలో రోడ్లు
ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
(ఆంధ్రజ్యోతి-చండూరు)
చండూరు మునిసిపాలిటీలో ప్రధాన రహదారులన్నీ అధ్వానంగా మారాయి. చిన్నపాటి వర్షం పడినా పట్టణమంతా చిత్తడిగా మారుతోంది. రహదారులపై ఏర్పడిన గుంతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల వెడల్పు అ టుంచితే కనీసం గతుకుల రోడ్డుకు అతుకులైనా వేయాలని ప్రజలు కోరుతున్నారు.
నిత్యం వందలాది మంది ప్రజలు మర్రిగూడ, నాంపల్లి, చండూరు, గట్టుప్పల, మండలాలకు చెందిన ప్రజలు చండూరు మండలకేంద్రానికి రాకపోకలు సాగిస్తుంటారు. జిల్లా కేంద్రానికి వె ళ్లాలంటే ఈ రోడ్డుపై ప్రయాణించాలి. రో డ్డుకు ఇరువైపులా డ్రైనేజీ లేకపోవడంతో వర్షపు వరద నీరు ప్రధాన రహదారిపైకి రావడంతో గుంతలుగా మారి రహదారులు పూర్తిగా ధ్వంసమ య్యాయి. కస్తాల ఎక్స్‌రోడ్డు, పాత తహసీల్దా ర్ కార్యాలయం ఎదుట, కస్తూర్బాగాంధీ పాఠశాల ఎదుట, మునుగోడు బైపాస్ వద్ద పెద్దపెద్ద గుం తలు ఏర్పడ్డాయి. వాటిని గమనించకపోవడంతో వాహనదారులు రాత్రి వేళల్లో ప్రమాదాలకు గురవుతున్నారు.
అసంపూర్తిగా డ్రైనేజీ నిర్మాణం
పట్టణంలో రూ. 30కోట్లతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. రోడ్డుకు ఇరువైపులా నిర్మించాల్సిన డ్రైనేజీ పనులను కాంట్రాక్టర్ అసంపూర్తిగా వదిలివేశాడు దీంతో ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షానికే డ్రైనేజీలో నిలిచిన మురుగు నీరు ప్రధాన రహదారులపైకి ఎక్కువ లోతు లో నీరు చేరడంతో వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఇతర మార్గాల ద్వారా రాకపోకలు సాగించారు.
రివ్యూ చేసినా ఫలితం శూన్యం
రోడ్డు విస్తరణ నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని 2023 డిసెంబరు 25న, 2024 జూన 13న మునిసిపాలిటీ అభివృద్ధిపై పట్టణంలో ఆర్ అండ్‌బీ గెస్టుహౌస్ అన్ని శాఖల అధికారులతో అప్పటి ఎమ్మెల్యేలు సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా రోడ్డు విస్తరణ పనులపై సంబంధిత అధికారులతో ఆరా తీశారు. నాసిరకంగా పను లు చేపట్టారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని గుత్తేదారుడికి, అధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఆశించిన స్థాయిలో పనిలో పురోగతి కనిపించడం లేదు.
ర్యాంపు తొలగింపులో వివక్ష
చండూరు మునిసిపాలిటీలో రోడ్డు విస్తరణ తీరు. విస్తరణ కోసం అడ్డుగా ఉన్న దుకాణాల మెట్లు ర్యాంపులు మునిసిపల్ అధికారులు తొలగిస్తున్నారు. కానీ కొందరికీ మాత్రం మినహాయింపు ఇచ్చినట్లు తొలగించకుండా వదిలేసి ప నులు జరుపుతున్న తీరు పక్కపక్కనే ఉన్న వారిపట్ల వివక్ష వెల్లువెత్తుతుం ది. పైరవీ, ధన ప్రవాహం ఈ వివక్షకు కారణమా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తప్పిన పెను ప్రమాదం
రోడ్డు విస్తరణ పనుల్లో కాంట్రాక్టర్ నిర్ల క్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో పెను ప్రమాదం తప్పింది. జూన 27వ తేదీన పట్టణంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా నాటిన కొత్త గా విద్యుత స్తంభాలు నాటే సమయంలో సరై న పద్ధతులు పాటించకపోవడంతో, చిరు వ్యా పారం చేసుకునే తోపుడు బండిపై పడటంతో అది పూర్తిగా ధ్వంసమైంది.
డీపీఆర్ లేకుండా పనులు
రోడ్డు విస్తరణ పనులకు డీపీఆర్ లేకుండా చేస్తున్నారు. మొదట 100 ఫీట్లు చెప్పిన అధికారులు, ఒక దగ్గ ర 95ఫీట్లు, మరో దగ్గర 90ఫీట్లు, మరో చోట 85 ఫీట్లు అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. వ్యాపారపరంగా చండూరు పట్టణంలో జనసంచారం ఎక్కుగా ఉంటుంది. విస్తీర్ణం తగ్గిస్తే భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. విస్తీర్ణం పనుల్లో సంబంధిత అధికారుల్లో స్పష్టత లేదు.
నలపరాజు సతీ్‌షకుమార్
నష్టపరిహారం చెల్లించాలి
రోడ్డు విస్తరణ పనుల్లో కోల్పోతున్న దుకాణ యజమానులకు నష్టరిహారం చెల్లించాలి. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని పనులు నాణ్యతో పూర్తి చేయాలి.
కొత్తపాటి సతీష్
నిబంధన ప్రకారమే విస్తరణ పనులు
చండూరు పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు నిబంధనల ప్రకారమే చేపడుతు న్నాం. పనులు త్వరలో పూర్తి చేసేలా కాంట్రాక్టర్‌కు సూచిస్తాం.
మల్లేశం, మునిసిపల్ కమిషనర్