Share News

ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డు పర్సన్‌ రాష్ట్ర మహా సభలు

ABN , Publish Date - Dec 12 , 2025 | 02:09 AM

తెలంగాణ ఆల్‌ పెన్షన ర్స్‌ ఆండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర మూడో మహాసభలను మంచి ర్యాల పట్టణంలో గురువారం నిర్వహిం చారు.

ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డు పర్సన్‌ రాష్ట్ర మహా సభలు

మంచిర్యాల క్రైం, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఆల్‌ పెన్షన ర్స్‌ ఆండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర మూడో మహాసభలను మంచి ర్యాల పట్టణంలో గురువారం నిర్వహిం చారు. ముఖ్య అతిథిగా అ సోసియేషన్‌ జిల్లా అధ్యక్షు డు కె ప్రభాకర్‌ ముఖ్య అతిథిగా, రాష్ట్ర అద్యక్షుడు పి నారాయ ణరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెన్షన్‌ ప్రభుత్వం పెట్టే బిక్ష కాదని, ఉద్యోగి హక్కు అంటూ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి డీవై చంద్ర చూడ్‌ పిలుపునిచ్చారన్నారు. రిటైర్డు అయిన ప్రతీ పెన్షనర్‌కు పెన్షన్‌ అందిం చాలని డిమాండ్‌ చేశారు. 1998-99 ఉద్యోగ కార్మిక వర్గాలకు పెన్సన్‌ నిర్ణయించిందని, మూడు సంవత్సరాలకు ఒకసారి పెన్షన్‌ పెంచాలని ఒప్పందం చేసుకున్నప్పటికి గత 27 సంవత్సరాల నుంచి అదిఅమలు కాలేదన్నారు. రిటైర్డు అయిన తర్వాత ఇచ్చే బెనిఫిట్లు ఇవ్కపోగా వారు దాచుకున్న జీపీఎల్‌ఐ బెనిఫిట్స్‌ కూడా ఇవ్వడంలేదన్నారు. పెన్షనర్లు సంఘటితమై పోరాటాలు చే యాల్సిన ఆశ్యకత ఉందన్నారు. నా యకులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 12 , 2025 | 02:09 AM