All India Prison Duty Meet: సెప్టెంబరు 9 నుంచి ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్
ABN , Publish Date - Aug 19 , 2025 | 05:17 AM
జైళ్ల శాఖ జాతీయ స్థాయి డ్యూటీ మీట్‌కు తెలంగాణ వేదిక కానుంది. సెప్టెంబరు 9 నుంచి 11 వరకు హైదరాబాద్ వేదికగా ఏడవ అఖిల భారత ‘ప్రిజన్ డ్యూటీ మీట్-2025’ జరగనుంది.
లోగో, వెబ్‌సైట్ ఆవిష్కరించిన డీజీ సౌమ్య మిశ్రా
హైదరాబాద్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి) : జైళ్ల శాఖ జాతీయ స్థాయి డ్యూటీ మీట్‌కు తెలంగాణ వేదిక కానుంది. సెప్టెంబరు 9 నుంచి 11 వరకు హైదరాబాద్ వేదికగా ఏడవ అఖిల భారత ‘ప్రిజన్ డ్యూటీ మీట్-2025’ జరగనుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జైళ్ల శాఖ అధికారులు ఇందులో పాల్గొంటారు. ఈ డ్యూటీ మీట్‌కు సంబంధించిన లోగో, ఈవెంట్ వెబ్‌సైట్‌ను తెలంగాణ జైళ్ల శాఖ డీజీ డా. సౌమ్యామిశ్రా చంచల్‌గూడలోని ‘స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్’(సికా)లో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అఖిల భారత ప్రిజన్ డ్యూటీ మీట్‌కు తెలంగాణ వేదిక కావడం గొప్ప విషయమన్నారు. ఈ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించడంలో లోగో, వెబ్‌సైట్ ప్రారంభించడం ఒక ముఖ్యమైన అడుగు అన్నారు. ఇందులో పాల్గొంటున్నట్లు ఇప్పటి వరకు 22 రాష్ట్రాల నుంచి ధ్రువీకరణ అందిందన్నారు. వీటిలో 13 రాష్ట్రాలు ఇప్పటికే పాల్గొనే వారి పేర్ల జాబితాను అందజేశాయన్నారు.