Share News

విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలి

ABN , Publish Date - Nov 20 , 2025 | 11:22 PM

వసతి గృ హాల్లో ఉంటున్న విద్యార్థులకు అన్ని వసతులు సక్ర మంగా కల్పించాలని షెడ్యూల్‌ కులాల అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పి.శ్రీనివాస్‌రావు అన్నారు. గురువారం సా యంత్రం అయన పట్టణంలోని పలు వసతిగృహాలను సంభందిత అధికారులతో కలిసి ఆకస్మికంగా పరిశీ లించారు.

 విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలి

షెడ్యూల్‌ కులాల అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావు

లక్షెట్టిపేట, నవంబరు20 (ఆంధ్రజ్యోతి): వసతి గృ హాల్లో ఉంటున్న విద్యార్థులకు అన్ని వసతులు సక్ర మంగా కల్పించాలని షెడ్యూల్‌ కులాల అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పి.శ్రీనివాస్‌రావు అన్నారు. గురువారం సా యంత్రం అయన పట్టణంలోని పలు వసతిగృహాలను సంభందిత అధికారులతో కలిసి ఆకస్మికంగా పరిశీ లించారు. వసతిగృహాల్లో విద్యార్థులకు హెచ్‌డబ్లువోలు అందజేస్తున్న భోజనంతో పాటు ఇతర సౌకర్యాలపై ఆరా తీసారు. అంతే కాకుండా కిచెన్‌, స్టోర్‌ రూం, వా ష్‌రూమ్స్‌, డైనింగ్‌ హాల్స్‌లను పరిశీలించారు. వి ద్యార్థుల రోజువారి హాజరు పరిశీలించిన ఆయన ప్రతీ రోజు అటెండెన్స్‌ని ఆన్‌లైన్‌లో క్రమం తప్పకుండా న మోదు చేయాలని వార్డెన్స్‌ని ఆదేశించారు. విద్యార్థులు ఇప్పటి వరకు నేర్చుకున్న పాఠాలను అడిగి తెలుసుకు న్నారు, అనంతరం ఆయన మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగా వసతిగృహాలను తనిఖీ చేస్తామన్నారు. విద్యార్థులకు ప్రతీ రోజు ప్రభుత్వం నిర్ణయిం చిన మెనూ ప్రకారం భోజనంతో పాటు అల్పాహారం అందించాలని అవి కూడా నాణ్యతతో ఉండాలన్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఇబ్బందులు కలు గకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు కావాల్సిన అవసరాలు వస తుల ఇండెంట్‌ తెలియజేయాలని అధికారులను కోరారు. ఈకార్యక్రమంలో ఆయన వెంట ఎఎస్‌డ బ్లు వో దర్మానంద్‌గౌడ్‌, ఎస్సీ వెల్ఫేర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ చా తరాజు దుర్గాప్రసాద్‌ ఉన్నారు.

Updated Date - Nov 20 , 2025 | 11:22 PM