Share News

భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించాలి

ABN , Publish Date - Nov 12 , 2025 | 11:05 PM

సోమశిల కృష్ణానది మీదుగా శ్రీశైలం పాతాళ గంగ వరకు టూరిజం ఆధ్వర్యంలో నడుపుతున్న క్రూయిజ్‌ ఏసీ లాంచీని బుధవారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు.

భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించాలి
సోమశిలలో లాంచీని పరిశీలిస్తున్న మంత్రి జూపల్లి

- సోమశిలలో శ్రీశైలం క్రూయిజ్‌ లాంచీని పరిశీలించిన మంత్రి జూపల్లి

కొల్లాపూర్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : సోమశిల కృష్ణానది మీదుగా శ్రీశైలం పాతాళ గంగ వరకు టూరిజం ఆధ్వర్యంలో నడుపుతున్న క్రూయిజ్‌ ఏసీ లాంచీని బుధవారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. ఆయన మా ట్లాడుతూ ప్రతీ వారం తప్పని సరిగా కృష్ణానది మీదుగా శ్రీశైలం వరకు క్రూ యిజ్‌లాంచీని నడపాలని పర్యాటక శాఖ జిల్లా అధికారి కల్వరాల నరసింహ ను ఆదేశించారు. శ్రీశైలం వెళ్లే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని తెలిపారు. భవిష్యత్తులో సోమశిల గ్రామం పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతుం దని, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని జూపల్లి పేర్కొన్నారు. పర్యాటకులకు వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు.

Updated Date - Nov 12 , 2025 | 11:05 PM