Share News

అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

ABN , Publish Date - Jul 04 , 2025 | 12:19 AM

: జిల్లాలో అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్లు, రేషన్‌కార్డులు ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పబ్బు వీరస్వామి డిమాండ్‌ చేశారు.

అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న సీపీఐ నాయకులు

నల్లగొండ(కలెక్టరేట్‌), జూలై 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్లు, రేషన్‌కార్డులు ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పబ్బు వీరస్వామి డిమాండ్‌ చేశారు. పార్టీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. నల్లగొండ పట్టణంలోని నిరుపేదలు పానగల్లు రోడ్డులోని అనేశ్వరమ్మ గుట్ట సర్వే 33 ప్రభుత్వ భూమిలో ఇళ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. వారి దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలన్నారు. అనంతరం కలెక్టరేట్‌ పరిపాలనాధికారి మోతీలాల్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి కర్ర సైదిరెడ్డి, లెనిన్‌, మదార్‌, సుజాత, విజయ, చింత ధనలక్ష్మీ, అక్కులయ్య, యూసూఫ్‌, శంకర్‌, యేసు, కె. మల్లేష్‌, లింగయ్య పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2025 | 12:19 AM