Akbaruddin Owaisi: 15రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించాలి
ABN , Publish Date - Aug 31 , 2025 | 04:03 AM
ప్రజల సమస్యలపై చర్చించేందుకు కనీసం 15రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మజ్లిస్ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి చేశారు.
స్పీకర్‌కు మజ్లిస్ పక్ష నేత అక్బరుద్దీన్ వినతి
హైదరాబాద్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యలపై చర్చించేందుకు కనీసం 15రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మజ్లిస్ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు శనివారం వినతిపత్రం అందజేశారు. భారీ వర్షాల నేపథ్యంలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం, రైతు భరోసా, రైతు బీమా, యూరియా కొరత, ధాన్యం కొనుగోలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సంక్షేమ పథకాలు, బడ్జెట్ కేటాయింపులు, ఓవర్సీస్ స్కాలర్‌షిప్పులు, ఇమామ్, మౌజన్లకు గౌరవ పారితోషికం చెల్లింపు తదితర సమస్యలపై చర్చించాల్సి ఉందని పేర్కొన్నారు.