Share News

Air India Flight Survivor Struggle: మృత్యుంజయుడు కాదు.. జీవచ్ఛవం

ABN , Publish Date - Nov 04 , 2025 | 04:37 AM

విశ్వకుమార్‌ రమే ష్‌...ఎంతో అదృష్టవంతుడని అప్పట్లో అందరూ అనుకున్నారు. అహ్మదాబాద్‌లో జూన్‌ 21న జరిగిన ఘోర విమాన ప్రమాదంలో..

Air India Flight Survivor Struggle: మృత్యుంజయుడు కాదు.. జీవచ్ఛవం

  • విశ్వకుమార్‌ రమేశ్‌ను ఆదుకోని ఎయిర్‌ ఇండియా

లండన్‌, నవంబరు 3: విశ్వకుమార్‌ రమే ష్‌...ఎంతో అదృష్టవంతుడని అప్పట్లో అందరూ అనుకున్నారు. అహ్మదాబాద్‌లో జూన్‌ 21న జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ ఏకైక వ్యక్తి అతడే కావడంతో అందరూ ఆయన ప్రశంసించారు. గాలిలోకి ఎగిరిన కొద్ది క్షణాల్లోనే విమానం కూలడంతో 241 మంది మరణించగా, 11ఏ సీటు వద్ద కూర్చొన్న ఒక్క రమేష్‌ మాత్రం తప్పించుకున్నాడు. అయితే, ప్రస్తుతం ఆయన పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. ప్రమాదానికి బాధ్యత వహించాల్సిన ఎయిర్‌ ఇండియా ఆదుకోవడం లేదని కుటుంబ సభ్యులు వాపోయారు. బ్రిటిష్‌ పౌరుడైన ఆయనకు అహ్మదాబాద్‌లో చికిత్స చేసిన అనంతరం తిరిగి బ్రిటన్‌లోని లీసెస్టర్‌కు పంపించారు. ఆయన ప్రస్తుతం పోస్ట్‌ ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌ (పీటీఎ్‌సడీ) బాఽధపడుతున్నా పట్టించుకునే వారే లేరు. అతడు రోజంతా మౌనంగా ఉండిపోతూ భార్య, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం లేదు.

Updated Date - Nov 04 , 2025 | 04:37 AM