Share News

ఆదివాసీల హక్కుల పరిరక్షణ ధ్యేయం

ABN , Publish Date - Aug 09 , 2025 | 11:27 PM

ఆదివాసీల హక్కు ల, చట్టాల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్నామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి అందించడం కోసం ప్రత్యేక కార్యచరణ రూపొందిం చా మని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. శనివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల నుంచి ఐబీ చౌరస్తాలోని వైశ్య భ వన్‌ వరకు ఆదివాసీలు ర్యాలీ నిర్వహించారు.

ఆదివాసీల హక్కుల పరిరక్షణ ధ్యేయం
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి) : ఆదివాసీల హక్కు ల, చట్టాల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్నామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి అందించడం కోసం ప్రత్యేక కార్యచరణ రూపొందిం చా మని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. శనివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల నుంచి ఐబీ చౌరస్తాలోని వైశ్య భ వన్‌ వరకు ఆదివాసీలు ర్యాలీ నిర్వహించారు. శాస్ర్తీయ నృత్యాలు చేస్తూ ఆదివాసీల పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కా ర్యక్రమంలో కొమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొని మా ట్లాడారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణే ధ్యేయమని, అటవీ హక్కుల సంరక్షణ చట్టాన్ని సంపూర్తిగా అమలు చేసేందుకు ప్రభుత్వం కార్యాచ రణ రూపొందించమన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలకు జరుగు తున్న ఇబ్బందులను తమ దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి అఽ దికారులను కేటాయించి సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నా మన్నారు. ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములపై వారికి పట్టా లు ఇచ్చేందుకు ప్రభుత్వం సైతం అంగీకారం తెలిపిందని ఎలాంటి ఇ బ్బందులున్నా తనకు తెలియజేయాలన్నారు. అనంతరం జిల్లా గిరిజన అబివృద్ధి అధికారి జనార్ధన్‌, తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్య దర్శి నీలకంటేశ్వర్‌రావు మాట్లాడుతూ ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమ స్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపడం సంతోషదాయక మన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివాసీ భవన్‌ కేటాయించాలని, తమపై దాడులు ఆపివేయాలని, అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరుతూ కలె క్టర్‌కు ఆదివాసీ సంఘం నాయకులు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాపు, జేక శేఖర్‌, నైతం లక్ష్మణ్‌, ఆడె జంగు, శంకర్‌, భార్గవ్‌ ,తిరుపతి, చిలకయ్య , రవీందర్‌, రాజ్‌కుమార్‌, హన్మంతు, ఆదివాసీలు పాల్గొన్నారు.

Updated Date - Aug 09 , 2025 | 11:27 PM