Share News

AIIMS Delhi: ఢిల్లీ ఎయిమ్స్‌ నంబర్‌ 1

ABN , Publish Date - Oct 04 , 2025 | 03:40 AM

దేశంలోనే అత్యుత్తమ వైద్య బోధన సంస్థగా న్యూఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్‌) తన ప్రతిష్ఠను నిలబెట్టుకుంది...

AIIMS Delhi: ఢిల్లీ ఎయిమ్స్‌ నంబర్‌ 1

  • తెలుగు రాష్ట్రాలకు నిరాశే

  • మొదటి 50ల్లో ఉస్మానియా

గుంటూరు మెడికల్‌, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): దేశంలోనే అత్యుత్తమ వైద్య బోధన సంస్థగా న్యూఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్‌) తన ప్రతిష్ఠను నిలబెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నేషనల్‌ ఇనిస్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎ్‌ఫ)లో 91.80 పాయింట్లతో న్యూఢిల్లీ ఎయిమ్స్‌ దేశంలోనే మొదటి స్థానం దక్కించుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు కొంత నిరాశే ఎదురైంది. ఏపీ, తెలంగాణ నుంచి కేవలం ఉస్మానియా వైద్యకళాశాల ఒక్కటే టాప్‌ 50లో చోటు దక్కించుకుంది. 51.46 పాయింట్లతో ఉస్మానియాకు 48వ ర్యాంకు దక్కింది. గుంటూరు వైద్య కళాశాల 42.10 పాయింట్లు సాధించింది. వైద ్య పరిశోధనలో కొంత వెనుకబడటంతో జీఎంసీ టాప్‌ 50లో స్ధానం పొందలేకపోయింది. దేశవ్యాప్తంగా మెడికల్‌ కాలేజీలకు వాటి పని తీరు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ర్యాంకులు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయా వైద్య బోధన సంస్థల మధ్య ఆరోగ్యకరమైన పోటీకి ఈ ర్యాంకులు దోహదపడతాయని, వైద్య విద్యార్థులు కూడా తాము చదివే కళాశాలను ఎంచుకొనేందుకు ఈ ర్యాంకులు తోడ్పడతాయని భావించి ఎన్‌ఐఆర్‌ఎ్‌ఫకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కళాశాలలో బోధన, వైద్య సిబ్బంది పని తీరు, వైద్య పరిశోధనలు, గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత తదితర పలు అంశాలను పరిగణలోకి తీసుకొని ర్యాంకులు కేటాయించారు. మొత్తం 100 పాయింట్లకు కనీసం 50 పాయింట్లు సాధించిన మెడికల్‌ కాలజీలకు ర్యాంకులు కేటాయించారు. దేశంలో మొదటి 10 స్థానాల్లో ఉన్న కళాశాలలు... 1) ఎయిమ్స్‌, న్యూఢిల్లీ(91.80 పాయింట్లు), 2) పిగ్మర్‌, చంఢీగఢ్‌(82.58), 3) సీఎంసీ, వెల్లూరు(76.48), 4) జవహర్‌ లాల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్టు గ్రాడ్యుయేషన్‌ అండ్‌ రీసెర్చ్‌, పాండిచ్చేరి(73.30), 5) సంజయ్‌గాంధీ పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, లక్నో(70.09), 6) బెనారస్‌ హిందూ యూనివర్శిటీ, వారాణసి(70.05), 7. నిమ్‌హ్యాన్స్‌, బెంగళూరు(69.77), 8) కింగ్‌ జార్జ్‌ మెడికల్‌ యూనివర్శిటీ, లక్నో(68.77), 9) అమృత విశ్వ విద్యాపీఠం, కోయంబత్తూరు(68.52), 10) కస్తూర్భా మెడికల్‌ కాలేజ్‌, మణిపాల్‌(68.05).

Updated Date - Oct 04 , 2025 | 03:40 AM