D. Nageshwar Reddy: ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి అంబుజ్‌నాథ్ బోస్ ప్రైజ్
ABN , Publish Date - Nov 08 , 2025 | 02:50 AM
రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్‌కి సంబంధించి ’2025 అంబుజ్ నాథ్ బోస్ ప్రైజ్’’ ఈసారి ఏఐజీ సంస్థల చైర్మన్, చీఫ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డాక్టర్...
హైదరాబాద్ సిటీ, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్‌కి సంబంధించి ’2025 అంబుజ్ నాథ్ బోస్ ప్రైజ్’’ ఈసారి ఏఐజీ సంస్థల చైర్మన్, చీఫ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డాక్టర్ డి. నాగేశ్వర్‌రెడ్డికి దక్కింది. ఎండోస్కోపీ రంగంలో ఆయన చేసిన కృషి, ఆధునిక పరిశోధనలకు గాను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మొదటిసారి 1998లో డాక్టర్ సి. గోపాలన్ పొందగా, డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి దీన్ని అందుకున్న రెండో భారతీయుడు. లండన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ (ఆర్‌సీపీ) శాస్త్రీయ విశిష్టత, ఆవిష్కరణలను గుర్తిస్తూ ఏటా నిర్వహించే హార్వేయన్ ఆరేషన్ ద్వారా వైద్య శాస్త్రాన్ని అభివృద్ధి చేయాలనే దీర్ఘకాలిక సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. ఈ కార్యక్రమాన్ని 1656లో విలియమ్ హార్వే స్థాపించారు. వైద్య రంగంలో అసాధారణ కృషి, విశిష్ట పరిశోధన చేసిన శాస్త్రవేత్తను సత్కరించడం దీని లక్ష్యమని ఏఐజీ తెలిపింది. వైద్య ఆవిష్కరణలలో నాయకత్వాన్ని ప్రదర్శించిన, ప్రపంచ వైద్య సమాజాన్ని నిరంతరం ప్రేరేపిస్తున్న ప్రొఫెసర్ డాక్టర్ డి. నాగేశ్వర్‌రెడ్డికి ఏఐజీ ఆస్పత్రి కుటుంబం తరపున ఆ సంస్థ అభినందనలు తెలిపింది.