Share News

AI Mentor: శ్రీచైతన్య విద్యాసంస్థల నుంచి ఏఐ మెంటార్‌

ABN , Publish Date - Sep 13 , 2025 | 04:43 AM

శ్రీచైతన్య విద్యాసంస్థల ఇన్ఫినిటీ లెర్న్‌ ఏఐ ఆధారిత మెంటార్‌ ఏఐఎన్‌ఏ(ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ నర్చరింగ్‌ అసిస్టెంట్‌)ను విడుదల చేసింది...

AI Mentor: శ్రీచైతన్య విద్యాసంస్థల నుంచి ఏఐ మెంటార్‌

  • విద్యార్థులకు 5 సెకన్లలో సందేహ నివృత్తి

  • ఇంగ్లి్‌షతో పాటు 9 భాషల్లో అందుబాటు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 12 (ఆంధ్రజ్యోతి): శ్రీచైతన్య విద్యాసంస్థల ఇన్ఫినిటీ లెర్న్‌ ఏఐ ఆధారిత మెంటార్‌ ఏఐఎన్‌ఏ(ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ నర్చరింగ్‌ అసిస్టెంట్‌)ను విడుదల చేసింది. ఇది దేశంలోనే మొట్టమొదటి వాయిస్‌ ఫస్ట్‌, ఏఐ ఆధారిత మెంటార్‌ అని సంస్థ తెలిపింది. ఇది సాధారణ చాట్‌ బాట్‌ కాదని, విద్యార్థులకు తక్షణ సందేహ నివృత్తి చేస్తుందని శ్రీచైతన్య ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ సీఈవో, డైరెక్టర్‌ సుష్మ బొప్పన తెలిపారు. ఆత్మవిశ్వాసం, ప్రేరణతో పాటు విద్యార్థుల్లోని అసలైన సామర్ధ్యాన్ని వెలికితీయడమే తమ లక్ష్యమన్నారు. ఇన్ఫినిటీ లెర్న్‌ వ్యవస్థాపక సీఈవో ఉజ్వల్‌ సింగ్‌ మాట్లాడుతూ గూగుల్‌ క్లౌడ్‌, ఐఐఐటీ-హైదరాబాద్‌ సహకారంతో రూపొందిన ఈ టెక్నాలజీ ఇప్పటికే 96.7 శాతం ఖచ్చితత్వంతో సమాధానాలు ఇస్తోందన్నారు. ఇంగ్లి్‌షతో పాటు 9 భారతీయ భాషల్లో సహాయం అందిస్తోందని తెలిపారు. ఇన్ఫినిటీ లెర్న్‌కు దేశవ్యాప్తంగా 10వేల పాఠశాలల్లో 10లక్షల ప్రీమియం లెర్నర్స్‌ ఉన్నారని సంస్థ నిర్వాహకులు తెలిపారు.

Updated Date - Sep 13 , 2025 | 04:43 AM