AI Assisted Cheating Caught: ఏఐ సాయంతో పరీక్షలో మాల్‌ప్రాక్టీస్
ABN , Publish Date - Dec 25 , 2025 | 05:05 AM
రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘రోబో’ సినిమా గుర్తుందా? అందులో పరీక్షహాల్లో ఉన్న ఐశ్వర్యరాయ్ ..
అడ్డంగా దొరికిన ఇద్దరు హరియాణావాసులు.. హెచ్‌సీయూలో ఘటన
రిజిస్ర్టార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
రాయదుర్గం, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘రోబో’ సినిమా గుర్తుందా? అందులో పరీక్షహాల్లో ఉన్న ఐశ్వర్యరాయ్ .. బయట నుంచి ‘చిట్టి’ రోబో చెప్పే సమాధానాలను చెవిలో ఉన్న బ్లూటూత్ సాయంతో వింటూ పరీక్ష రాస్తుంది! తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్యోగ పరీక్ష రాయడానికి హరియాణా నుంచి వచ్చి ఇదే తరహాలో మాల్ ప్రాక్టీ్‌సకు పాల్పడుతున్న ఇద్దరు విద్యార్థులు అడ్డంగా దొరికిపోయారు. కాకపోతే వారు ఈ మాల్ ప్రాక్టీ్‌సలో భాగంగా ‘రోబో’కు బదులు ‘కృతిమ్ర మేధ’ను వాడుకున్నారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నాన్ టీచింగ్ విభాగంలో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగ నియామకాల కోసం ఇటీవల నోటి ఫికేషన్ విడుదల చేశారు. 21వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్యాంప్‌సలో రాత పరీక్ష నిర్వహించారు. హరియాణాకు చెందిన అనిల్ కుమార్ (30) ఈ రాత పరీక్షకు హాజరయ్యాడు. అతను పరీక్ష రాస్తు న్న సమయంలో అనిల్ చెవిలో ఉన్న బ్లూటూత్ నుంచి పదే పదే ‘బీప్’ శబ్దం రావడంతో పరీక్ష కేంద్రంలో పర్యవేక్షకునిగా ఉన్న అధికారి అతన్ని తనిఖీ చేయగా.. అతడిచొక్కాకు అంటించి ఉన్న ఒక స్కానర్, పొట్టకు అమర్చుకున్న ఎలకా్ట్రనిక్ పరికరాలు కనిపించాయి. అతడు పరీక్ష పేపర్‌ను స్కాన్ చేసి.. బాత్‌రూమ్‌కు వెళ్లి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సమాధానాలు తెలుసుకొని చెవిలో ఉన్న బ్లూటూత్‌లో వింటూ పరీక్ష రాస్తున్నట్లుగా గుర్తించారు. ఆ తర్వాత అనుమానంతో మిగతా విద్యార్థులను సైతం క్షుణ్నంగా తనిఖీ చేయగా.. అదే పరీక్ష హాలులో హరియాణాకే చెందిన మరో యువకుడు సతీశ్ సైతం ఇదే విధంగా కాఫీ చేస్తున్నట్లు తేలింది. హెచ్‌సీయూ రిజిస్ట్రార్ దేవేశ్‌నిగమ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులనూ అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.