Share News

Tummala Nageshwar Rao: ఆర్థిక లక్ష్యసాధనలో వ్యవసాయమే కీలకం

ABN , Publish Date - Dec 06 , 2025 | 05:58 AM

వ్యవసాయరంగమే రాష్ట్ర ఆర్థిక లక్ష్య సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించబోతోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు....

Tummala Nageshwar Rao: ఆర్థిక లక్ష్యసాధనలో వ్యవసాయమే కీలకం

  • గ్లోబల్‌ సమ్మిట్‌తో మరింత పురోభివృద్ధి: తుమ్మల

హైదరాబాద్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయరంగమే రాష్ట్ర ఆర్థిక లక్ష్య సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించబోతోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గ్రామీణ జనాభాలో 66ు మందికి ఉపాధి అందించే వ్యవసాయం రాష్ట్ర జీఎ్‌సవీఏలో 17ు వరకు వాటా కలిగి ఉందని, దాంతో తెలంగాణ ఆర్థిక వృద్ధిలో వ్యవసాయ అభివృద్ధి కేంద్రబిందువుగా ఉంటుందని పేర్కొన్నారు. గ్లోబల్‌ సమ్మిట్‌పై సచివాలయంలో శుక్రవారం ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతు ఆదాయం, ఉత్పాదకత పెరుగుదల, విలువ ఆధారిత వ్యవసాయం విస్తరణ, ఎగుమతుల పెంపు.. ఇవన్నీ 3 ట్రిలియన్‌ ఆర్థిక లక్ష్యాన్ని సాధించడానికి అత్యంత కీలక అంశాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2025 ప్రధాన లక్ష్యం రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమేనన్నారు. గ్లోబల్‌ సమ్మిట్‌లో ప్రదర్శించాల్సిన అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ వ్యవసాయరంగం అభివృద్ధి సామర్థ్యాలు, విదేశీ పెట్టుబడి అవకాశాలు, భవిష్యత్‌ విజన్‌ స్పష్టంగా ప్రతిబింబించేలా ఏవీలను రూపొందించాలని ఆయన సూచించారు.

Updated Date - Dec 06 , 2025 | 05:58 AM