Share News

పెద్దకొత్తపల్లిలో అగ్నివీర్‌ ఆర్మీ పరుగు పోటీలు

ABN , Publish Date - Nov 05 , 2025 | 11:25 PM

మండల కేంద్రమైన పెద్దకొత్తపల్లి హై స్కూల్‌ గ్రౌండ్‌లో బుధ వారం అగ్నివీర్‌ ఆర్మీ ర్యాలీ పోటీలను స్థానిక ఎస్‌ఐ సతీష్‌ ప్రారం భించారు. 1600 మీట ర్ల పరుగు పందెం ని ర్వహించారు.

పెద్దకొత్తపల్లిలో అగ్నివీర్‌ ఆర్మీ పరుగు పోటీలు
అగ్నివీర్‌ ఆర్మీ పరుగు పోటీలను ప్రారంభిస్తున్న ఎస్‌ఐ సతీష్‌

పెద్దకొత్తపల్లి, నవం బరు 5 (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రమైన పెద్దకొత్తపల్లి హై స్కూల్‌ గ్రౌండ్‌లో బుధ వారం అగ్నివీర్‌ ఆర్మీ ర్యాలీ పోటీలను స్థానిక ఎస్‌ఐ సతీష్‌ ప్రారం భించారు. 1600 మీట ర్ల పరుగు పందెం ని ర్వహించారు. రాష్ట్రంలో ని వివిధ జిల్లాలకు చెం దిన యువత పాల్గొన్నారు. ఈ పోటీల్లో మొద టి బహుమతి రూ.5వేల నగదు వరంగల్‌కు చెందిన సతీష్‌ గెలుచుకున్నారు. రెండవ రూ. 4వేలు బహుమతి వరంగల్‌కు చెందిన సుర్జిత్‌, మూ డవ రూ. 3బహుమతి నల్గొండకు చెందిన ధనుష్‌, నాల్గవ రూ. 2వేలు బహుమతి దేవరకొండకు చెందిన ధోని, ఐదవ రూ. వెయ్యి బహుమతి మహబూబ్‌నగర్‌కు చెందిన శేఖర్‌కు నిర్వాహకులు అందజేశారు. ఈ పోటీల నిర్వాహకులుగా పోనమోని లింగస్వామి, పోన మోని లాలు, పడిగే శంకర్‌, జక్కుల వాసు వ్యవహరించారు. విజేతలకు బహుమతులను సింగిల్‌ విండో డైరెక్టర్‌ దండు చంద్రయ్య, అశో క్‌రెడ్డి, డబ్బా ఎల్లయ్య, శివశంకర్‌లు ప్రదానం చేశారు. ఈ పోటీలు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దండు నరసింహ సహకారంతో నిర్వహించారు.

Updated Date - Nov 05 , 2025 | 11:25 PM