Share News

kumaram bheem asifabad- వయోజనులకు విద్యనందించాలి

ABN , Publish Date - Aug 20 , 2025 | 11:05 PM

గ్రామాల్లో వయోజనులను గుర్తించి వారిని అక్షరాస్యులుగా మార్చాలని జిల్లా వయోజన విద్య కోఆర్డినేటర్‌ నాగరాజు అన్నారు. సర్‌సిల్క్‌ ప్రాథమిక పాఠశాల బ్రాంచ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన నవభార్‌ సాక్షరత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామంలోని ఉపాధ్యాయులు, స్వయం సహాయక సంఘం సభ్యుల సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించారు.

kumaram bheem asifabad- వయోజనులకు విద్యనందించాలి
మాట్లాడుతున్న జిల్లా వయోజన విద్య కోఆర్డినేటర్‌ నాగరాజు

కాగజ్‌నగర్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో వయోజనులను గుర్తించి వారిని అక్షరాస్యులుగా మార్చాలని జిల్లా వయోజన విద్య కోఆర్డినేటర్‌ నాగరాజు అన్నారు. సర్‌సిల్క్‌ ప్రాథమిక పాఠశాల బ్రాంచ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన నవభార్‌ సాక్షరత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామంలోని ఉపాధ్యాయులు, స్వయం సహాయక సంఘం సభ్యుల సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించారు. జిల్లా కమ్యూనిటి అధికారి కటకం మధూకర్‌ మాట్లాడుతూ ఉల్లాస్‌ కార్యక్రమం ద్వారా గ్రామాల్లోని ఎంపిక చేసిన కార్యకర్తల ద్వారా వయోజనులకు విద్య నేర్పించేట్టు చూడాలన్నారు. ఎంఈవో ప్రభాకర్‌ మాట్లాడుతూ అక్షరాస్యులైన వయోజనులను దూర విద్య విధానం ద్వారా పదవ తరగతి పరీక్షలు రాయించి వారిని పై చదువులకు వెళ్లేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్‌ పర్సన్లు సుందిళ్ల రమేష్‌, జిత్తు నాయక్‌, ఎంఐఎస్‌ కోఆర్డినేటర్‌ శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

కెరమెరి, (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో వయోజనులను గుర్తించి వారికి విద్యను అందించాలని ఎంఈవో ప్రకాష్‌ అన్నారు. బుధవారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నవ భారత్‌ సాక్షారతా కార్యక్రమంలో భాగంగా ఉల్లాస్‌ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 సంవత్సరాల పైబడిన నిరక్ష్యరాస్యులను గుర్తించి వారిని అక్షరాస్యులుగా తీర్చిద్దాలనా ్నరు. నాలుగు నెలలు రెండు వందల గంటలు ఈ కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు. గ్రామ స్థాయిలో నేటి నుంచి కార్యక్రమాలు రూపొందించాలని తెలిపారు.

దహెగాం, (ఆంధ్రజ్యోతి): నవభారత్‌ సాక్షరతా కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఉన్నత పాఠశాలలో ఆర్పీలకు, ఉపాధ్యాయులకు ఉల్లాస్‌పై శిక్షణ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఈవో శ్రీనివాస్‌ పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు కిషన్‌రావు, శ్రీదేవి, మధుకర్‌ పాల్గొన్నారు.

సిర్పూర్‌(టి), ఆంధ్రజ్యోతి): వయోజనులకు, బడిమానిన విద్యార్థులను అక్షరాస్యు లుగా తీర్చిదిద్దాలని ఎంఈవో వేణుగోపాలరావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నవభారత్‌ సాక్షరతా ఉల్లాసం కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడిమానిన విద్యార్థుల కోసం ఉల్లాసం కార్యక్రమం ప్రారంభించిందన్నారు. కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 20 , 2025 | 11:05 PM